శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 బ్యాంకు అందరికీ తెలుసు.దాని మూలార్ధం ఎవరికీ తెలీదు.బెంచ్ బ్యాంకు మూలతః ఒకేశబ్దం.ఇటలీలో దీనిపుట్టుక.వెనీస్ ఒకప్పుడు వ్యాపార కేంద్రం. సెయింట్ మార్గ్ చౌరస్తాలో బెంచీలు పై నాణాలు పెట్టుకుని ఇచ్చి పుచ్చుకోవడం చేసేవారు వ్యాపారులు.ఇటాలియన్ భాషలోబెంచీని బైంకో అంటారు.బెంచీపై నాణాల గుట్ట ఉన్న దాన్ని బైంకో అని పిలిచేవారు.క్రమంగా బెంచీల స్థానంలో టేబుల్ మేజా వాడుక లోకి రావడంతో రూపాయల నాణాలగుట్టలని బైంకో అనడం మొదలైంది.ట్యుటానిక్ శబ్దం బైంకా నించి ఇటాలియన్ బైంకో ఆంగ్ల బెంచ్ ఉద్భవించాయి.🌷
కామెంట్‌లు