న్యాయాలు -212
రథ బడబా న్యాయము
*****
రథము అంటే తేరు, శరీరము, వాహనము అనే అర్థాలు కలవు.బడబా అంటే ఆడు గుఱ్ఱము,బ్రాహ్మణ స్త్రీ, సముద్రపు అగ్ని,బడబానలం అనే అర్థాలు ఉన్నాయి.
రథ బడబా అంటే రథమును లాగు గుర్రముల వలె అనే అర్థంతో తీసుకోబడింది.
రథము లాగేందుకు కట్టిన గుర్రాలు ఒకదాని కొకటి కలుపుకుని ఒకే తీరుగా నడవాలి.అప్పుడే రథము సరిగా నడుస్తుంది.ఆ రెండింటి మధ్య నడకలో, వేగంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఆ రథము సరిగా ముందుకు పోలేదు.
అలాగే ఆలుమగల దాంపత్యం సజావుగా సాగాలంటే ఇద్దరి ఆలోచనలు , అభిప్రాయాలు ఆలోచనలు ఒకే విధంగా వుండాలి అనే అర్థంతో ఈ రథ బడబా న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
అయితే మన పెద్దలు అనే మాట ఏమిటంటే భార్యా భర్తలు ఇద్దరూ సంసార రథానికి చక్రాల వంటి వారనీ ఆ రెండు చక్రాలలో ఏ ఒక్క చక్రం సరిగా లేకపోయినా సంసార రథం ముందుకు సాగదు అంటారు.
కానీ నా భావనలో కూడా "రథ బడబా న్యాయము" వలె వివాహం అనేది ఓ జీవిత రథం లేదా సంసార రథం. ఆ రథం నడిచేందుకు స్త్రీ పురుషులను ఇద్దరినీ వివాహమనే బంధంతో రెండు శరీరాలను,రెండు ఆత్మలను ముడి వేసి జత చేస్తారు.వారిరువురూ రెండు వైపులా జోడు గుర్రాల వలె రథాన్ని లాగుతారన్న మాట.ఇద్దరూ సమానంగా నడిస్తేనే సంసార రథం సజావుగా నడుస్తుంది. ఎలాంటి పొరపొచ్చాలు వచ్చినా, ఇద్దరిలో అభిప్రాయ భేదాలు కలిగినా రథం నడక కుంటుపడుతుంది. ఆధిపత్య భావనతో ఒకరు అవమాన భారంతో మరొకరుంటే రథ చక్రాల పట్టు తప్పిపోతుంది.జీవన ప్రయాణం వేదనా భరితం అవుతుంది.ఇదే అర్థంతో ఈ సంస్కృత న్యాయము చెప్పబడింది.
స్త్రీ అయినా పురుషుడైనా ఒక బలమైన వివాహ బంధం ఏర్పడిన తర్వాత ఒకరినొకరు గౌరవించుకుంటూ,ఏమైనా అపోహలు అపార్థాలు పొడసూపితే తెగేదాకా పోకుండా పరిష్కార మార్గాలను వెతుక్కుంటూ కలిసి పోయి నడిస్తేనే ఏ సమస్య అయినా అద్దం మీద ఆవగింజలా జారిపోతుంది.
ఒకరికొకరు సంతోషాలు, దుఃఖాలను పంచుకుంటూ, అన్ని విషయాల్లో పాలూ, నీళ్ళలా సహకరించుకుంటేనే సంసారం ఆనందాల పరిమళాలు వెదజల్లే పూల తేరు అవుతుంది.
కాబట్టి సంసార రథాన్ని నడిపే ప్రతి జంట ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి