వాన వెలిసిన ఉదయం
ఊరట పొందిన జగం
తెరిపిన పడ్డ జనం
చురుకుగ తగిలిన కిరణం
వంద ఏనుగుల బలం
వేల బాధలకు ఓదార్పు
లక్ష సమస్యలకు జవాబు
కోటి కలలకు ఆధారం
హృదయానికి పెద్ద బలం
దేహానికి కొత్త చైతన్యం
ఊహలకు తెలియని ఊతం
భయాలకు దొరికే అభయం
ఆశించినవే కావాలి అనుభవం
శోధించి సాధించాలి విజయం
ఫలించకపోయినా అదృష్టం
తప్పక ఫలిస్తుంది పడినకష్టం
నిశ్శబ్దంలో చర్చలు
మౌనంతో యుధ్ధాలు
మనస్సాక్షితో పోరాటాలు
బ్రతుకంతా ఆరాటాలు
ఓటమితో పాఠాలు
ఓరిమితో విజయాలు
సహనంతో సత్ఫలితాలు
సంయమనంతో పరిష్కారాలు
జీవితగమనంలో
తెలుసుకుని అర్థాలు
ఆచితూచి అడుగేయకపోతే
ఎదురయేవి అన్నీ అనర్థాలే!
ఈనాటి ఉదయం
ఏ సమస్యలు తీర్చునో
ఏ ఆనందాలు పంచునో
ఆశయే జీవన సూత్రం
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి