మొండి ఘటం (చిట్టి వ్యాసం)-- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 అవును నేను మారను. ఎలాగైనా నేను మారను. నాదేవుడు నాదయ్యం, నాగుడి నాగుండం, నామడి నాతడి, నాపూజలు నావిగ్రహాలు, నాతీర్థం నాప్రసాదం, నాయజ్ఞాలు నాజాతరలు, నాదసరా నాదీపావళి, నాసంక్రాంతి నాశివరాత్రి, నాశివుడు నారాముడు, నాసూర్యుడు నాగణేషుడు, నాఅష్టోత్తరనామాలు నాసహస్రనామాలు, నావేదాలు నాపురాణాలు, నాఉపనిషత్తులు నాఇతిహాసాలు, ఇవన్నీ నావే. వీటినెన్నటికీ వీడను. కాని… మసీదు, చర్చి, గురుద్వారా, బసదీలు, ఆరామాలను గౌరవిస్తా. నమాజు, ప్రార్థన, గురువందనం, జైన బౌద్ధ ధ్యానాలు సమాదరిస్తా. రంజాన్, బక్రీద్, క్రిస్మస్, ఈస్టర్, పర్యుషాన, బుధ్ధపూర్ణిమ, నానక్ జయంతిలను సమ్యక్ దృష్టితో చూస్తా. సకలమతాలూ, కులాలూ, వర్గాలూ, వర్ణాలూ భరతమాత కంఠసీమలో వెలుగుతున్న పుష్పమాలలోని రంగురంగుల పూలే. అందుకే ఎవరికీ బాధ కలిగించను. నాదారి నేనెన్నటికీ మరవను. ఏంచేసినా ఎలాగైనా నేను మారను. ఎంతైనా మొండి ఘటాన్ని మరి!!!
+++++++++++++++++++++++++
.
కామెంట్‌లు