ఖజురహో (ఇండియా);- తాటి కోల పద్మావతి

 ఖజురహో దేవాలయ సముదాయంలోకి పాశ్చాత్య సందర్శకులు అడుగు పెట్టబోయే ముందు తమ పాశ్చాత్య నైతిక విలువల్ని, సభ్యత సంస్కృతుల్ని, మర్చిపోగలిగితేనే హిందూయిజం అనే ఒక నిండు అయిన, సంపూర్ణమైన జీవన విధానం భావనలోని లోతులను, పరిపూర్ణతను, విజ్ఞతను, అవునత్యాన్ని పురుషించగలుగుతారు.
క్రీస్తు శకం 18 39వ సంవత్సరంలో టి.ఎస్.బట్ అనే ఒక బ్రిటిష్ అధికారి అపురూపమైన శిల్పాలతో అలంకరించబడిన ఖజురహో దేవాలయ సముదాయాన్ని కనుగొనడం జరిగింది. భారతదేశంలోని ఎంతో అందమైన దేవాలయాల సముదాయాన్ని తాను కనుగొన్నానని మొదట ఎంతో ఉల్లాసంగా ప్రకటించుకున్న బట్ తర్వాత తమ విక్టోరియన్ నైతిక విలువలను, తమ సంస్కృతిలోని అసంపూర్ణతను వీటికి కొల బద్దలుగా అన్వయింపజేసి, ఖజురహో లోని శిల్పాన్ని, శిల్ప భంగిమలను వాటిలో నిహితంగా ఉన్న ప్రణయ భావనని, శారీరక మానసిక సాన్నిహిత్యాన్ని అర్థం చేసుకోలేక ఆ భావనని అందుకునే మానసిక ఆధ్యాత్మిక జైవిక పరిపక్వత లేక వాటిని అసభ్యమైన శిల్పాలని, ఆ శిల్పాల భంగిమలు మనుషుల్లో కామోద్రేకాన్ని రెచ్చగొట్టి, వారి శీల సంపదని లుక్తం చేసే నైతికంగా పతనం చేసే అతి శారీరక వాంఛలకు ప్రతీకలని హిందూ మతానికి అల్పత్వాన్ని ఆపాదింప చేశాడు.
ఖజురాహోలో అతిపెద్ద దేవాలయం 'కాందారియా'మహాదేవ దేవాలయం. శివుడికి అంకితమీయబడిన ఈ దేవాలయంలో ప్రధాన వృత్త శిల దాదాపు 100 అడుగుల ఎత్తు ఉంటుంది. కైమూర్ ఇసుకరాయిలో చెక్కబడిన 800 పైగా బొమ్మలు ఈ దేవాలయం గోడలకు, నల్ల శాణపు శిలగల పుష్పాలంకరణలు పైకప్పుకు శోభనిస్తుంటాయి. హిందూ ప్రపంచంలోనే అత్యద్భుత శిల్పకళా నిర్మాణము కళాత్మక సాధనలో ఒకటిగా పేరుపొందిన ఈ ఖజురహో దేవాలయ సముదాయం.

కామెంట్‌లు