న్యాయాలు-203
మృత మారణ న్యాయము
******
మృత అంటే చచ్చిన ,చచ్చిపోయిన అని అర్థం.మారణము అంటే చంపుట,వధించుట అని అర్థము.
చచ్చిన వానిని చంపినట్లు అని అర్థము.దీనినే తెలుగులో "చచ్చిన పామును చంపినట్లు" అని కూడా అంటారు.
చచ్చిన వానిని మళ్ళీ చంపడం ఏమిటా అని బిలియన్ డాలర్ల సందేహం మనసును తొలుస్తూ వుంటుంది. కానీ ఈ న్యాయమును రాసిన పెద్దల పరిశీలనతో కూడిన ఆలోచనను అర్థాన్ని గ్రహిస్తే నిజంగా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో అర్థమవుతుంది.
కొంత మంది తెలిసే తెలియక తప్పు చేసి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటారు. అలాంటి వారిని పదే పదే ఆ తప్పు గుర్తు చేసి దెప్పి పొడవడం అంటే "చచ్చిన వానిని మళ్ళీ చంపినట్లే"కదా!.
అలా కాకుండా కావాలని కసాయితనంతో తప్పు చేసిన వాడిని వాడు చచ్చినా సరే మళ్ళీ మళ్ళీ చంపాలనిపించడం కూడా "చచ్చిన వానిని చంపినట్లే".
ఇలాంటి సందే
హం, సంశయాన్ని నివృత్తి చేసుకోవాలంటే మహా భారతంలో ధర్మరాజు, భీష్ముడి మధ్య జరిగిన సంభాషణ తెలుసుకోవాల్సిందే.
కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడిని అంపశయ్య పాల్జేసినందుకు దుఃఖిస్తూ ధర్మరాజు ఈ యుద్ధం, వినాశనానికి కారణం నేనే పట్టుదలకు పోకుండా వుంటే ఇంత జరిగేది కాదు.ఇప్పుడు పశ్చాత్తాపపడి ప్రయోజనం లేదు, నాకు దుఃఖమే తప్ప మనశ్శాంతి ఎలా కలుగుతుంది " అని వాపోతాడు.
అప్పుడు భీష్ముడు ఊరడిస్తూ ఓ కథ చెబుతాడు.అది మనం కూడా తెలుసుకుందాం.
ఓ బ్రాహ్మణ స్త్రీ కుమారుడిని పాము కరవడంతో చనిపోతాడు. చనిపోయిన కొడుకును చూసుకుంటూ ఏడుస్తూ వుంటే అక్కడికి వచ్చిన బోయవాడు ఆ పిల్లవాడిని కరిచిన పాముని పట్టుకొని వచ్చి "అమ్మా! నీ పుత్రుని ప్రాణం తీసిన ఈ పామును తల పగులగొట్టి చంపమంటావా? నిలువునా చీల్చి చంపమంటావా? " అనగానే ఆ స్త్రీ "అన్నా! విధివశాత్తు ఈ ఆపద కలిగింది.దానికి కారకులైన వారిని చంపడం అధములు చేసే పని. ఒకవేళ ఆవేశంతో ఆ పామును చంపినా చనిపోయిన నా కుమారుడు ఎలాగూ తిరిగి బతకడు కదా!" అంటుంది.
అప్పుడు బోయవాడు "చంపిన వాడిని చంపడమే నాకు తెలిసిన ధర్మము.జనులను బాధించిన వారిని చంపడమే ధర్మము. దాని వల్ల ఎలాంటి పాపము రాదు." అంటాడు.
అప్పుడు ఆ వనిత "బాధించిన వాడు శత్రువునైనా చంపడం అధర్మము కదా!" అనగానే...
"చంపదగిన యట్టి శత్రువు తన చేత/ జిక్కెనేని కీడు సేయరాదు/ పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు/ విశ్వధాభిరామ వినురవేమ!"...మనకు కూడా ఈ వేమన పద్యం గుర్తుకు వస్తుంది కదండీ!
కానీ బోయవాడు మాత్రం "ఈ పాముని చంపితేనే దీని కాటు వల్ల బాధింపబడకుండా ఇతరులను రక్షించ వచ్చు" అంటాడు.ఇలా ఇద్దరి సంభాషణ జరుగుతుండగా మధ్యలో పాము కల్పించుకుని మాట్లాడుతూ "మృత్యుదేవత ఆవహించి నాతో ఈ పని చేయించింది.ఇది నా తప్పు కాదు". అంటుంది.
అంతలో మృత్యుదేవత అక్కడికి వచ్చి ఇది నాతప్పు కూడా కాదు.యముడు ఆదేశించాడు.ఆ ప్రకారం నా ఆజ్ఞను పాము పాటించింది.అంటుండగా అక్కడికి యమ ధర్మరాజు వచ్చి ఆ బాలుని ఆయుషు అంత వరకే ఉంది" అని కర్మ సిద్ధాంతం,దాని ఫలితాల గురించి వివరంగా చెబుతాడు.
భీష్ముడు కూడా ఈ విధంగా ధర్మరాజు యొక్క వేదనా భరిత పరిస్థితిని చూస్తాడు ."చచ్చిన వానిని చంపినట్లు"గా పశ్చాత్తాపంతో బాధ పడుతూ వుండటంతో పై విషయాలను సోదాహరణంగా వివరించి"వారి మరణానికి కారణం వారు చేసిన దుష్కర్మల ఫలితమే కానీ నీవు కాదు." అని చెప్పి ఊరడిస్తాడు.
ఇదండీ "మృత మారణ న్యాయము" అంటే"చచ్చిన పామును చంపడం" లేదా "చచ్చిన వానిని చంపడం "అన్న మాట.
ఈ న్యాయము చదివిన తర్వాత 'తప్పు చేసి కుమిలిపోయే వారిని క్షమించాలి' అనిపిస్తుంది. 'అలాంటి పశ్చాత్తాపం ఏ కోశానా లేని వారిని మరింత కఠినంగా శిక్షించాలని అనిపిస్తుంది' నాకైతే... 'మరి మీరేమంటారు?'
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి