మారేడు లేదా బిల్వము హిందూ దేవతలలో ఒకరైన శ్రీ మహాశివుని ఆరాధనలో ఒక ముఖ్యమైన పూజాంశంగా భావిస్తారు. శివాపురాణం ప్రకారం శివుని బిల్వ పత్రములతో పూజించుట శ్రేష్టము. బిల్వ వృక్షము సాక్షాత్తు శివస్వరూపమని దేవతలు భావిస్తారు. బిల్వ పత్రం లేనిదే శివుని పూజ పూర్తి కాదని శాస్త్ర వాక్యం కూడా. తమ జాతక చక్రంలో శని దోషమున్న వారు, ఆ దోషమున్నవారు, ఆ దోషపరిహారార్ధము నన్ను బిల్వ పత్రములలో పూజిస్తే దోష నివృత్తి జరుగును. బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు' అని స్వయంగా శివుడు శనీశ్వరునికి అభయమిచ్చెను. బిల్వపత్రం అంటే శివుడికి చాలా ఇష్టం. శివలింగంపై బిల్వపత్రాలను ఉంచి పూజ చేస్తే తప్పక శివానుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఏకంగా శివారాధన కోసం బిల్వాష్టకమే ఉంది. శివ పూజలో బిల్వ పత్రానికి అంత ప్రాశస్త్యం ఉంది. ఓ సారి బిల్వ వృక్షం కింద శివుడు తప్పస్సు చేస్తున్నప్పుడు పార్వతి శివ పూజకు అవసరమయ్యే పూజ సామగ్రిని తేవడం మరచిపోయింది. అక్కడే పడి ఉన్న బిల్వపత్రాలనే పుష్పాలుగా ఉపయోగించి పూజ చేయడం ప్రారంభించింది. వాటితో శివుడిని పూర్తిగా కప్పేసింది. ఆ పూజ ఆయనకు ఎంతో నచ్చి చాలా సంతోషించాడు. అప్పటి నుంచి శివారాధనకు బిల్వపత్రాలను ఉపయోగిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి.మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి.
అతిసార వ్యాధికి దీని పండ్ల రసం చాలా మంచి మందు.
ఆయుర్వేదములో వాడు దశమూలం లలో దీని వేరు ఒకటి.
మొలలకు ఇది మంచి ఔషధము.
దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.
బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి . . . బిల్వ ఆకుల కషాయము తీసి అవసరము మేరకు కొంచం తేనె చుక్కలు కలిపి తాగితే జ్వరము తగ్గుతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి