నీ నేనే నా నీవే (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 నీ ప్రేమధార నీ కంటిచూపులోనుండి నా హృదయంలోకి ప్రవహిస్తోంది. అందుకే
నీవే నా చూపువయ్యావు. నీ ప్రేమధార
నీ నోటిమాటల్లోనుండి నా మనసులోకి ప్రవహిస్తోంది. అందుకే నీవే నా శబ్దానివయ్యావు. నీ ప్రేమధార నీ స్పర్శలోనుండి నా అంతరంగంలోకి ప్రవహిస్తోంది. అందుకే నీవే నా మధురానుభూతివయ్యావు. నీ ప్రేమధార
నీ నిశ్వాసలోనుండి నా శరీరంలోకి ప్రవహిస్తోంది. అందుకే నీవే నా ఊపిరివయ్యావు. కనుకనే నేనంటాను ప్రియా! నీ నేనే నా నీవే అని నిజమే కదూ?!!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు
Joshi Madhusudhana Sharma చెప్పారు…
బాగుంది సార్.. ఎప్పుడో యవ్వనంలో ఉన్నప్పుడు వ్రాసినట్లుంది.. అభినందనలు. 🌹🙏🌹