దాశరథి జయంతి సందర్భంగా (స్మృతి మణిపూసలు)- నన్నపురాజు రమేశ్వరరాజు- విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి-గుర్తూరు హనుమకొండ
చదువులమ్మ సన్నిధి
సాహిత్యపు పెన్నిధి
తెలంగాణ ముద్దుబిడ్డ
మన సుకవి దాశరథి!.1

అక్షరాల మెరిపించె 
అగ్నిధార కురిపించె
అధికారపుపీఠాలను
అదే పనిగ వణికించె!.2

కవితలెన్నో పలికించె
రుద్రవీణను వినిపించె
ముసలినక్క తిక్కనణచి 
నైజామును గద్దె దించె! .3

పొట్టివాడు గట్టివాడు
పుట్టెడు కైతలకు రేడు 
సాహిత్యాకాశాన
ఎర్ర ఎర్రని సూరీడు! .4

జరపాలిక శతజయంతి
తెలుగుభాషకదియెకాంతి
ఆచంద్రా తారార్కం
దాశరథియె ఒజ్జబంతి!.5

నా తెలంగాణ కోటి రతనాల వీణ

కామెంట్‌లు