శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 బాలెమన్ శబ్దం నుంచి బాలమ్ పదం వచ్చింది.దీని అ ర్థం భర్త అని.అరబిక్ పదం ఆపైఫారశీ భాషలోంచి
హిందీ లో కి దిగుమతి ఐంది.బ్రజ అవధీ బఘేల్ భాషల్లో పతి భర్త అనే వాడుకలో ఉంది.జానపద గీతాల్లో బాలం అని వాడతారు.అసలు అర్థం "నా పతి నా మొగుడు".అదిపోయి మగడు అని వాడుక లో కి వచ్చింది.
బాదరాయణ సంబంధం అని వింటాం.ఆయన ఓప్రసిద్ధ లేఖకుడు.బ్రాహ్మణ గ్రంధాల తర్వాత సూత్రకాలంకి చెందిన దార్శనికుడు.ఈయన బ్రహ్మ సూత్రాల ఆధారంగా శంకరాచార్యులవారు అద్వైత వేదాంత ప్రభోదం చేశారు అని కథనం.మహాభారతకర్త వ్యాసునికి కూడా బాదరాయణుడు అనేపేరు ఉంది.
బాదరాయణ సంబంధం అనే పదం వెనుక ఓకథనం ఉంది."మా ఇంట్లో రేగు చెట్టు ఉంది.మీ బండికి రేగు కట్టెలతో చేసిన చక్రం ఉంది.ఇదే మన బాదరాయణ సంబంధం" అని ఎవరో తమ ఇంటికి వచ్చిన అతిధి తో చమత్కరించారు.ఎలాంటి సంబంధం స్నేహం లేకపోయినా ఫంక్షన్ కి వెళ్లి శుభ్రంగా తిని వస్తారు కొందరు.వడ్డించేవారు బంధువులు అనుకుంటారు.ముఖ్యంగా పెళ్లి లో జరుగుతాయి.అలాగే దొంగలు దూరినా తెలుసు కోలేంకదా?🌹
కామెంట్‌లు