తల్లి ప్రేమను గురించి అందరికీ బాగా తెలుసు. కానీ గురువు ప్రేమను గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఇక భగవంతుని ప్రేమను గురించి మనకు తెలిసింది ఇంకా చాలా తక్కువ. తల్లి చేసే పని, నిజమైన గురువు చేసే పని ఇంచుమించు ఒకేలా ఉంటాయి. తల్లి బిడ్డను తన గర్భంలో ఉంచుకుని కొంతకాలం మోస్తుంది. ఆ విధంగానే గురువు కూడా తన ఆథ్యాత్మిక శిశువును తన మనో పరిధిలో కొంతకాలం నిలుపుకుంటాడు. ఆ సమయంలో గర్భంలో నున్న శిశువు లాగానే, శిష్యుడు కూడా గురువు నుండి శక్తిని గ్రహించి, వారి ఆలోచనల నుండి ఉత్పన్నమయ్యే ఆథ్యాత్మిక తరంగాల నుండి పోషణ పొందుతాడు. కాలం పరిపక్వానికి వచ్చినప్పుడు, శిష్యుడు తేజోమయమైన ఆ దివ్య లోకాన ఉద్భవిస్తాడు. అప్పటి నుండే అతడి ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది. శిష్యుడు తన సర్వస్వాన్ని గురువుకు అర్పించి ఆయన మనో క్షేత్రంలో ప్రవేశించిన తరువాత, అతడు దివ్యలోకంలో ప్రవేశించడానికి కేవలం ఏడు నెలలు మాత్రమే చాలు. అయితే శిష్యుడు గురువు మనోక్షేత్రంలో ఉన్నప్పటికీ తన ఆలోచనల, భావాల స్పృహను తనలోనే ఉంచుకోవడం వలన ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. ఆ విధంగా గురువు స్థానం తల్లి స్థానం వంటిదే నని మనకు తెలుస్తోంది. గురువును ఆథ్యాత్మిక జననిగా భావించినందువలన ప్రేమ, భక్తి సమర్పణా భావాలు మనలో పెంపొందుతాయి. ఇవే ఆథ్యాత్మిక జీవితంలోని ప్రధానమైన అంశాలు.
మహాత్ములు శిష్యులను " మన్మతులు " " గురుమతులు " అనే రెండు ప్రధాన వర్గాలుగా విభజించారు. ప్రాపంచిక బాధలనుండి విముక్తి కోసమో, ధనాశ చేతనో, లేదా ఇట్లాంటివేవో ప్రాపంచిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గురువును ఆశ్రయించే వారు మొదటి కోవకు చెందుతారు. కోరికలు నెరవేరుతాయన్న ఆశ వారిలో సజీవంగా ఉన్నంత వరకే వారు ఆయనకు విధేయులుగా ఉంటారు. ఈ విషయంలో వారు నిరాశ చెందినప్పుడు గురువును వదలి వెళ్లిపోతారు. అటువంటి శిష్యుల విషయంలో విధేయతను కలిగి ఉండడం, ఒదిగి ఉండడం అనే ప్రశ్న అసలు ఉత్పన్నమే కాదు. ఇంక శరణాగతిని గురించి వేరే చెప్పనక్కరలేదు.
గురుమతులు అని పిలువబడే శిష్యుల విషయానికి వస్తే, వీరు అన్నివిధాలా గురువు యొక్క ఆజ్నలను శిరసావహిస్తారు. సాధ్యమైనంత మేర వారు అన్నివిధాలా ఆయన సంకల్పానికి లోబడి ఉంటారు. విధేయత తోనే శరణాగతి ప్రారంభమవుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి