ఆశా ఖేమకా! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఈమెను గూర్చి చదివితే అద్భుతంగా అనిపిస్తుంది.కానీ ఆమె పట్టుదల కృషి మనందరికీ స్ఫూర్తి దాయకం.71ఏళ్ళ ఆమె ఆశాఖేమ్కా!13వ ఏట పెళ్లి ఐంది.బీహార్ లో చిన్న పల్లెలో పుట్టిన ఈమె 1978లో కుటుంబం తో కల్సి బీహార్ లోని సీతామడి నుంచి బ్రిటన్ వచ్చి స్థిరపడ్డారు.పిల్లల టి.వి.షోలు చూస్తూ ఇతరులతో మాట్లాడుతూ ఆంగ్లం బాగా నేర్చుకుని కార్డిఫ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ డిగ్రీ పొందారు.ఆపై2006లోవెస్ట్ నాటింగ్హామ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఐనారు అంటే నమ్మబుద్ధి కాదు.అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ ఇన్ ఇండియా కి ఛైర్పర్సన్ గా ఉన్నారామె.ది ఇన్ స్పైర్ అండ్ ఎఛీవ్ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్ట్ ని నడుపుతున్నారు.2013లోబ్రిటన్ డేమ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అనే అత్యున్నత పురస్కారం లభించింది.అదీ పట్టుదల అంటే 🌹
కామెంట్‌లు