ఎవరెస్ట్ శిఖరం (నేపాల్);- సేకరణ తాటి కోల పద్మావతి

 క్రీస్తు శకం 19 24 వ సంవత్సరంలో ఇద్దరు బ్రిటిష్ పర్వతారోహకులు మాలరీ, ఇర్విన్లు ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నం చేశారు. తిరిగి వస్తూ మార్గమధ్యంలో తమ ప్రాణాల్ని కోల్పోయారు. వాళ్లు శిఖరం మీద కాలు మోపారా లేదా అనేది ఎవరికి అంతుపట్టని విషయంగా మిగిలిపోయింది.క్రీస్తు శకం 1953వ సంవత్సరంలో హిల్లరీ   క్రీస్తు శకం 1953వ సంవత్సరంలో హిల్లరీ, నార్కెలు మొట్టమొదటిసారిగా ఎవరెస్టు పర్వత శిఖరాన్ని అధిరోహించారు.
క్రీస్తు శకం 1960వ సంవత్సరంలో చైనా దేశానికి చెందిన పర్వతారోహకుల బృందం ఉత్తరపు మార్గము నుంచి శిఖరాన్ని చేరుకుంది.
క్రీస్తు శకం 1978 వ సంవత్సరంలో మెస్నర్ మరియు హబీలర్ అనే వారు ఆక్సిజన్ సిలిండర్లు ఉపయోగించకుండా శిఖరాన్ని చేరుకున్నారు.
క్రీస్తు శకం 1980వ సంవత్సరంలో ఐర లెండ్ కి చెందిన పర్వతారోహకుల బృందం సౌత్ సాడిల్ మార్గం ద్వారా శీతాకాలంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది.
క్రీస్తు శకం 1996వ సంవత్సరంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే క్రమంలో 15 మంది పర్వతారోహకులు తమ ప్రాణాల్ని పోగొట్టుకున్నారు.
క్రీస్తు శకం 2004 సంవత్సరంలోషేర్పా పెంబా డోరి ఆధార స్థావరం నుంచి ఎనిమిది గంటల్లో శిఖరాన్ని చేరుకొని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఎవరెస్టు శిఖరం ఎత్తు 29,028 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం.

కామెంట్‌లు