బోనాలమ్మా బోనాలు
బంగరు బొమ్మలు కదిలేరు
పట్టుసీరల కట్టి ఒల్లంతా నగలతో
నెత్తిన గుత్తంగ పూలనుసుట్టీ
పసుపు కుంకుమ సున్నపుబొట్లతో
కుండలో పాలు బెల్లం వండేరు
కుండపైదీపం దారి సూపంగ
గోరింట తో సేతులు పండంగ
పోతురాజులు డప్పు దరువులకు ఊగుతూ సాగంగ
అమ్మలంతా ఆషాఢమాసాన
అమ్మోరి సెంతకు తరలేరు
ప్లేగు మహమ్మారి కి వేలాదిపానాలు గాలిలో కలవంగ
ఉజ్జయిని అమ్మ లష్కర్ కి తరలేను
భాగ్య నగరం లష్కర్ బోనాలు
ఎల్లలు దాటి లండన్ వీధుల్లో
నాట్యమాడేను
పసుపు వేప క్రిముల సంపేను
రోగనిరోధక శక్తి కలిగించేను
గోల్కొండ జగదాంబ
ఉజ్జయిని మహంకాళి
లాల్ దర్వాజా సింహవాహిని
ఎల్లమ్మ పోచమ్మ పేరు ఏమైతేనేమి
అంతా శక్తిమయం
జగమంతా అమ్మ మయం🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి