బాల్యమంటే ఆనందం
బాల్యమంటే సుకుమారం
బాల్యమంటే..... నిర్మలం, నిష్కల్మషం !
బాల్యంలోని అందం....
... అందరికీ ఆనందం !
బాల్యం ఓ అర విరిసిన పువ్వు !
బాలల నవ్వులు, ముద్దు ముద్దు మాటలూ, చిలిపి చేష్టలు... బాధలనే మరిపించి
ప్రశాంతతను కలిగించే దివ్యౌషధాలు !
అందుకే..... లయకరుడు ఆ పరమ శివుడే... ముద్దొచ్చే బాలుడై... దూడతో ఆడుతూ తనముచ్చట దీర్చుకొనుచుండె... !
.
నుదుట తెల్లని విబూది రేఖ లతో, ఫాల నేత్రమే ఎర్రని బొట్టుగా...
సిగలో తెల్లని నెలవంక, కాల,రుద్రాక్షాలంకారభూషితుడై
మిల - మిలా మెరిసిపోతూ... ముద్దుగారే బాల శివుని...
చూసిన... కన్ను ల పండువే కదా !!
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి