ఓమారు ఓ ఆవిడ తీపి పదార్థాలతో కంచి పరమాచార్య దర్శనానికి వచ్చారు. తాను తీసుకొచ్చిన వాటిని కంచి పరమాచార్యకు సమర్పించి ఆయనతో తినిపించాలని ఆవిడ ఆరాటం. ఆశ.
వరుసలో నిల్చున్న ఆమె వంతు వచ్చింది.
ఆమెను చూడటంతోనే ఏవో బోలెడు పదార్థాలు తీసుకొచ్చినట్టున్నారు అన్నారు పరమాచార్య.
ఆ మాటలకు ఆవిడ "అవునండి" అన్నారు. 'మీరు ఇష్టంగా వాటిని రుచిచూడాలన్నది నా ఆశ" అన్నారామె. "మీరు రుచి చూస్తే అది నా భాగ్యమ"న్నారు.
అప్పుడు పరమాచార్య, "నేనేమో సన్న్యాసిని. నాలాంటి వారికి ఇటువంటివి ఇవ్వవచ్చా..." అని అడిగారు.
ఆ మాటతో ఆమె బాధపడింది.
వెంటనే పరమాచార్య "సరే, నువ్వు బాధపడక్కర్లేదు. నువ్వు ఎంతో ఆశతో తెచ్చానంటున్నావు కనుక కొంత తింటాను. మిగిలినవి ఇక్కడకు వచ్చిన వారికి ఇచ్చేసే" అంటూ ఓ ముక్క తీసుకుని నోట్లో వేసుకున్నారు.
దర్శనం కోసం వచ్చిన వారికి ప్రసాదం ఇచ్చేసి పరమాచార్య పూజ చేయడానికి వెళ్ళిపోయారు.
సహాయకుడితో ఇక ఈవేళకు అన్నం వద్దన్నారు.
పూజానంతరం ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయారు.
రాత్రి పరమాచార్య నోట్ల ఏదో వేసుకుని నమలుతున్నారు. ఇంతలో అటువైపు వచ్చిన ఆయన సహాయకుడు అది గమనించారు.
వెంటనే పరమాచార్య అతనిని దగ్గరకు పిలిచి "ఏమిట్రా ఈయనేదో అన్నం అక్కర్లేదున్నారు కానీ ఇప్పుడేదో తింటున్నారు కదాని అనుకుంటున్నావు. అవునా? ఇది మరేమిటో కాదు. ఇది గోమయం.... మధ్యాహ్నం ఆవిడెవరో ఇస్తే తిన్నాను కదూ. నాలుక ఆ రుచికి అలవాటైపోకూడదని ఈ గోమయాన్ని తింటున్నా" అన్నారు.
పరమాచార్య మాటతో సహాయకుడి కళ్ళు చెమ్మగిల్లాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి