కండలు తిరిగిన నిండైన విగ్రహం!5'10"ఎత్తున్న యువకుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నీలం రంగు టోపీతో బ్యాట్ పుచ్చుకుని బరిలోకి దిగితేచాలు! చప్పట్ల హోరు! జోష్ తో లెగ్ గ్లాన్స్ అనే కొత్త స్ట్రోక్ తో క్రికెట్ దిగ్గజం అనిపించుకున్నాడు. పక్కా భారతీయుడు.గుజరాత్ లోని నవానగర్ రాజవంశానికి చెందిన కుర్రాడు. 1872లో పుట్టి 1933లో తన 62వ ఏట జాంనగర్ మహారాజా గా తనువు చాలించిన దేశభక్తుడు.ఇంగ్లాండ్ లో ఉన్న భారతీయులు మనదేశంకి చెడ్డపేరు తేకూడదు అని తన సోదరుని కొడుకుకి టెలిగ్రాం పంపారు ఆయన!"దిలీప్!నీవు లైట్ లేకుండా ఇంగ్లాండ్ లో సైకిల్ తొక్కారు అని జరిమానా విధించారు అని పేపర్ లో చదివాను. మన దేశం కి అప్రతిష్ఠ తెచ్చి పనులు చేయకు.మన దేశం కోసం భారతీయ ప్రతినిధి గా క్రికెట్ ఆడుతున్నావని గుర్తు ఉంచుకో!"
1915 ఇంగ్లాండ్ లో స్టోన్స్ అనే ప్రాంతంలో ఈయన పోటీ ఏర్పాటు చేశారు. ఎగిరే పిట్టలను గురిచూసి కొట్టే పోటీ అది.ఓ ఆటగాడి తుపాకీ గుండు ఈయన కంటికి తగిలి కన్ను పూర్తిగా పోయింది. కానీ ఆవ్యక్తి పేరు బైట పెట్టని సహృదయుడు ఆయన! కేంబ్రిడ్జ్ విద్యార్ధిగా ఉన్నపుడు అతనికి ఏడాదికి 12వేల రూపాయలు ఇంటినుంచి వచ్చేవి.మిత్రులకోసం ఖర్చు పెట్టేవాడు. అప్పు చేసినా ఎక్కువ వడ్డీతో చెల్లించేవారు.
జాంనగర్ పిల్లలు ఇంగ్లాండ్ లో చదువు కోటానికి ఆయన సాయంచేసేవారు. 1900లో40ఓవర్లు బ్యాటింగ్ చేసి 5సార్లు నాటౌట్ గా నిలిచారు. పంచ్ అనే పత్రిక ఆయన బ్యాటింగ్ ని పొగుడుతూ కార్టూన్ వేసి పరుగుల సింహం అని రాసింది. క్రికెట్ విజ్డన్ అనే పత్రిక 5గురు క్రికెట్ వీరులచిత్రాల్లో ఈయన చిత్రం ని తొలి స్థానంలో అచ్చువేసింది.ఒక ఆంగ్ల కౌంటీ జట్టుకి కెప్టెన్ ఐన ఘనత దక్కింది. తొలి టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ సాధించిన వీరుడు!
తన 22వ ఏటనే నౌకలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి బైలు దేరిన ఆయన క్రికెట్ దిగ్గజం అనిపించుకున్నారు.నవానగర్ మహారాజా గా సంస్థానానికి సంబంధించిన వ్యవహారం స్వయంగా చూసేవారు. నానాజాతిసమితిలో1920లో ప్రతినిధి గా పాల్గొన్నారు.
ఇలాంటి దేశాభిమాని క్రికెట్ వీరుడు సదా స్మరణీయుడు🌷
ఆయన కె.ఎస్.రణజిత్ సింహ్!
రంజీ అనే ముద్దు పేరు తో అందరికీ సుపరిచితులు. రంజీట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ఆయనని సదా గుర్తుకు తెస్తుంది.🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి