పరుగులు పెడుతున్న కాలం
ఆగదు ఎవ్వరి కోసం
తిరిగిరాని క్షణాలకై
నిరీక్షణ ఎంతకాలం?
మూగబాధ భరిస్తున్నా
కలతలలో కరుగుతున్నా
పోరాటం మరవని
ఆరాటం ఎంతకాలం?
గగనం తాకే చూపు
గమనం ఆపని అడుగు
చింత తోనే చెలిమి చేసే
అలుపెరుగని పయనం
మౌనమైన వాదన
రోదనైన వేదన
గాధలన్నీ పరిచయమే
బాధలన్నీ బంధాలే!
ఆశలే జీవనసూత్రం
మార్పులే బ్రతుకున తథ్యం
ఓర్పు ఒకటే ఆధారం
అపురూప క్షణాల కూర్పే జీవితం
గతంలోని కొరతలన్నీ తీర్చి
మురిపించే వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి