వంట ఓకళ!అచ్యుతుని రాజ్యశ్రీ

 శివా  జయ పుస్తకాలు ముందు వేసుకుని "పెద్దవర్షం!కరెంటు పోతోంది. బడిలేక బోర్ బోర్! ఎన్ని సార్లు చదవాలి పాఠం? అమ్మ పని హాయ్!అటూఇటూ తిరుగుతూ వంట చేయడం!" తాత నవ్వుతూ "మరి అమ్మ కి సాయంచేయొచ్చుగా?" అని అడిగాడు. "అవతలికి పో!కూర తరగటం ఓకళ. అని కసురుకుంటుంది తాతా!" దేశం గా అంది జయ."అవును పాకశాస్త్రం ఓకళ.ఇప్పుడు అంతా హోటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటాలిటీ అనే కోర్సుకు బాగా డిమాండ్ పెరిగింది.మాస్టర్ శెఫ్ గా ముగ్గురు మహిళలు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు.కాందలా నిఝావన్ రాజకీయ నేతలకు రకరకాల వంటకాలు సరఫరా చేస్తుంది. ఆనాటి ప్రధాని నెహ్రూ బంధువులకి నేడు తన వంటలు రుచి చూపింది.కేకులు తయారీలో ప్రసిద్ధి. నందితా కరణ్ హాలీవుడ్ స్టార్స్ చేత సెభాష్ అనిపించుకున్న శెఫ్!     పాట్నాలో ప్రసిద్ధి కెక్కింది.పల్లవి గర్గ్ ప్రొఫెషనల్ శెఫ్.కార్పొరేట్ ఉద్యోగం వదిలి నేడు లక్షల్లో వ్యాపారం చేస్తోంది. " వెంటనే జయ అంది"తాతా! నేను కూడా  ఈకోర్స్ చేస్తాను.రకరకాల  వంటలు చేస్తూ తినవచ్చు."అలాగే  అన్నాడు తాత నవ్వుతూ 🌹
కామెంట్‌లు