కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మెదడు అత్యుత్తమంగా పనిచేస్తుందని ఆధునిక శాస్త్ర, ఆరోగ్య పరిశోధనలు కనుగొన్నాయి. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఘ్రెలిన్ అనే హర్మోన్నుఉత్పత్తి చేస్తుందని, అది కడుపుకు ఆకలిగా ఉందన్న సంగతిని మెదడుకు చేరవేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ హార్మోన్ ఇతర వ్యవహారాల్లో కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. నేర్చుకోవడానికి, జ్ఞాపక శక్తికి మరియు ప్రదేశ విశ్లేషణకి చెందిన పనులను చక్కబెట్టే మన మెదడులోని హిప్పోక్యాంపస్ అనే ప్రాంతాన్ని ఘ్రెలిన్ ఉత్తేజితం చేసి, దాని సామార్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల మనం చురుగ్గా, చలాకీగా, చేసే పని మీద ఎక్కువ ధ్యాసతో ఉంటాం. అయితే దీనర్థం మనం తినడం మానేయాలని కాదు, కానీ మనమెంత తింటున్నామన్న విషయంపట్ల జాగ్రత్తగ్గా ఉండాలన్న సంగతిని ఇది చెబుతోంది.
భారత దేశంలో, మరీ ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో వేసవి కాలంలో ఒకలా, వానాకాలంలో మరోలా, చలికాలంలో ఇంకోలా, ఆయా కాలాల్లో దొరికే కూరగాయలతో శరీరానికి సరిపడేట్లుగా వండుతారు. మనం ఈ వివేకంతో మన శరీర అవసరాలకు తగ్గట్టుగా, మారే వాతావరణానికి అనుగుణంగా తినడం మంచిది. ఒక మూస పద్ధతిలో మనల్ని ప్రవర్తింపచేసే ఆహారపు అలవాట్లని పెంచుకోవడం కంటే, మన వివేకాన్ని ఉపయోగించి స్పృహతో మన ఆహారం గురించి నిర్ణయించుకోవడం మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి.మంచి మొత్తంలో ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన ద్రవాలతో కూడిన ఆహారం మన ప్రేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటే ఎక్కువగా ఆకలితో ఉంటారు, ఇది బరువు పెరుగుటకు దారితీస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి