సమస్యాపూరణ ;- మచ్చ అనురాధ-సిద్దిపేట
 "క్రమ్మెను వెలుగులంతటను కన్నుల కెద్దియు గానిపించదే"! 
----------------------------------------------------------------------------------
కమ్మని బాల్యమో నదిట కానగ రాదిల స్నేహబంధముల్
నెమ్మనమున్ దలంచుచును నేస్తములందరి ప్రేమచేష్టలన్
నెమ్మదినొక్క రోజునను నేరుగ నింటికి రాగ స్నేహితుల్
గ్రమ్మెను వెల్గులంతటను కన్నుల కెద్దియు గానిపించదే!.

కామెంట్‌లు