రమ్యమైన రంగుల్లో
నింగీ నేలా నీరూ సోయగాలు
ఆరాటమే తప్ప అన్యమెరుగని
ఆలోచనా తరంగాలు
చేయితిరిగిన చిత్రకారుని
కుంచె పలికించు భావాలు
కనుదోయికి విందు చేసే
కమనీయ వర్ణాలు
మదిలోని భావాలన్నీ
మధురమైన కావ్యాలు
ఎదలోయల నిదురించిన
పదిలమైన పాపాయిలు
నిదురించు పాప నవ్వులా
ఆందమైన తలపుల పువ్వు
విరిసేటి మధుర సమయం
తడిసేను మమతలో అంతరంగం
భావనలకు బాష్యముండదు
కలలకు కారణాలుండవు
ఆలోచనలకు హద్దులుండవు
మనసు ముచ్చట వినే సమయముండదు
ఆకాశవీధిలో అరుదైన
రంగుల రంగవల్లులు
గగనపు వేదికపై వెలిగే
చిత్రవర్ణ యవనికలు
అరుణోదయవేళ
ఆహ్లాదభరితంగా
ఆవిష్కరించబడుతున్న
అపురూప వర్ణాలకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి