గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ.
ఆర్యా!!
విషయం --పదవ తరగతి తర్వాత ప్రభుత్వ ఉద్యోగం.
ఉన్నత విద్య-ఉత్తమ విద్య-ఉద్యోగ విద్య కావాలని కాలం చెల్లిన చదువుల కోసం ఎంతో విలువైన కాలము శ్రమ డబ్బు వృధా చేస్తున్నాం.
ఉన్నత విద్య ఉత్తమ విద్య ఉద్యోగ విద్య కావాలంటే అనివార్యంగా ఆంగ్లభాషలోనే చదవాల్సి వస్తుంది. భాష రాక భాష నేర్చుకోలేక భాష నేర్పేవారు లేక భాష విలువ తెలియక చాలామంది విద్యార్థులు వెనకబడి పోతున్నారు. ఇప్పుడు అవసరం లేదని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జాతీయ విద్యా విధానం లో మాతృభాషకే ప్రాధాన్యత ఇచ్చి మాతృభాషలోనే ఉన్నత విద్య ఉత్తమ విద్య ఉద్యోగ విద్య చదువుకోవచ్చు అని భరోసా ఇచ్చారు. ఇది గ్రామీణ విద్యార్థులకు గొప్ప అవకాశం. అందుకే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు నమస్సులు.
నాణ్యమైన విద్య నైపుణ్యాల విద్య అవసరాన్ని గుర్తించి సమయం వృధా కాకుండా నిరంతరం ఉన్నత విద్య కోసం ఉత్తమ విద్య కోసం అందరూ ప్రాకులాడకుండా పదవ తరగతి లోనే పని నేర్పే పనికొచ్చే విద్యను నేర్పించీ పదో తరగతి తర్వాత పనికి వెళ్లే విద్యా విధానాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రూపొందించి దాన్ని ఉద్యోగ విద్యగా గుర్తించి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తే. తప్పకుండా విద్యార్థుల మానవ వనరులను కాపాడడమే కాక యువత అంతా ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం ఉంది. ఈ విషయంలో మన ప్రియతమ మంత్రి కేటీఆర్ గారు కృషి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దృష్టికి కనుక ఈ విషయం వస్తే తప్పకుండా గుర్తిస్తారని ఆశిస్తున్నాను. గ్రామీణ పట్టణ విద్యార్థులకు ఉపాధి దొరికే అవకాశం ఉంది.
వృత్తి విద్యలు మాత్రమే కాక నైపుణ్యాలను
మానవ వనరులకు సంబంధించిన కోర్సులను రూపొందించి. ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉద్యోగ నియామకాలను చేపడితే, పదవ తరగతి తర్వాత ప్రభుత్వ ఉద్యోగం పొందగలిగితే, ప్రభుత్వ విద్యార్థుల ధనం శ్రమ విలువైన సమయం ఆదా అవుతుందని గౌరవనీయులైన ప్రియతమ ప్రధాని గారికి మరియు ప్రియతమ ముఖ్యమంత్రి గారికి పాద నమస్కారం చేస్తూ మనవి చేసుకుంటున్నాం.
కృతజ్ఞతలతో
మీ విధేయుడు
ప్రతాప్ కౌటిళ్యా
( కె.ప్రతాప్ రెడ్డి)
8309529273.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి