*కర్పూర వసంత రాయలు* *( మహాకవికి అభినందన కవిత)*;- *" రసస్రవంతి " & " కావ్యసుధ "*
కర్పూర వసంత రాయలు
కాదు, కవనామృతపు పాయలు
కదిలినట్లనిపించే మాకు
కల్ల కాదాయెను పరాకు.
ఎందుకంటే.....!?
మకమల్ శయ్యగా
పవళించు లకుమా......
సకల సుఖముల నొసగు లకుమ
ముఖము కానరాక రాయలు
వికల మతియైనట్లు తోచెను

" లకుమ.... లకుమా......
అనుచు .....రాయలు...
సఖిని కానక తపన చెందుతు
చిక్కి శల్యంబైన తనువుతొ
చింతలోనున్నట్లు దోచెను..
మీరూ....
ఆమె తన కను దీప మనుకొను
ఆమెయే తన ఊపిరనుకోను
అమర ప్రేమికుడైన రాయల
న- సహనముతో రోసినారా !

పండు వెన్నెలలోన మిరువురి
గుండె లేకము చేసి - తమతమ
నిండు కౌగిలిలోన బిగిసిన
రెండు యెదలెడ బాపినారా  !?

తానె చెలియై - చెలియై తానై
ప్రాణం మొకటై మసలు జంటను
ఒంటిగా విడదీసి  - వొకరిని
మట్టి లోపల పూడ్చినారా !?

అయినా.....!

రాజులో దీపించు రాగము
రమణిలకు మొనరించు త్యాగము
కపట మెరుగని రాణి ఓర్పును
కవనమల్లిన నీదు నేర్పును...
ఎట్లు పొగడక ఉందుము !
ఎట్లు మరుతుము ముందు మేము !!

*( అభినందన రచన కాలము 1974)*

*" రసస్రవంతి " & " కావ్యసుధ "*
హయత్ నగర్ : హైదరాబాడు


కామెంట్‌లు