బ్రహ్మ, నారద సంవాదంలో.....
దుందుభినిర్హ్లాదుడు - రాక్షసుడు - వ్యాఘ్ర రూపము - శివ భక్తుని మీద దాడి - శివుడు వధించుట........
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*విష్ణు దేవుడు, దితి కుమారుడు అయిన హిరణ్యాక్షుని సంహరించారు. అందువలన, దితి చాలా దుఃఖించింది. అప్పుడు రాక్షస రాజు దుందుభినిర్హ్లాదుడు, దితి దుఃఖాన్ని చూసి, ఆమెను ఊరడించే ప్రయత్నం చేస్తూ, "అమ్మా! నీ దుఃఖం పోవాలంటే, దేవతలను గెలవాలి. అంటే, వారు బలహీనులు అవ్వాలి. అంటే, వారికి ఆహారం దొరకకూడదు. దేవతలకు ఆహారం ఇచ్చే వారు, బ్రాహ్మణులు, మునులు, ఋషులు. కాబట్టి, వీరిని లేకుండా చేస్తే, దేవతలకు ఆహారం దొరకదు. అప్పుడు, దేవతలను జయించవచ్చు" అని దితికి చెప్పి, బ్రాహ్మణులు, మునులు, ఋషులు ఉండే శంభుని రాజధాని కాశీ పట్టణానికి, మిగిలిన అన్ని చోట్లకు వెళ్లి, పగటి పూట నీటిలో ఉండే జంతువులా నదిలో సరస్సులలో దాగి వుండి, స్నానం కోసం వచ్చిన వారిని చంపేసే వాడు, దైత్య రాజు దుందుభినిర్హ్లాదుడు. రాత్రి పూట, పులిలా (వ్యాఘ్రం) మారి చంపేసే వాడు. ఇలా చాలా కాలం గడిచింది.*
*ఒక శివరాత్రి రోజు, ఒక శివ భక్తుడు అయిన ముని, శివుని ఎలాగైనా చూడాలి అని తన ఆశ్రమంలో, ముందుగానే తనని ఏ శక్తి / రాక్షసుడు ఏమి చేయకుండా మంత్రం వేసి, శంకర ధ్యానంలో కూర్చున్నాడు. ఈ ముని, దైత్య రాజు కంట బడ్డాడు. అతని మీదకు తన ఆయుధాలను ప్రయోగించాడు. కానీ, మంత్ర ప్రభావం వల్ల, అవి పని చేయలేదు. అప్పుడు, పులి రూపం ధరించి, ఈ తనిని సంహరించాలి అనుకున్నాడు. అన్ని చోటులలో ఉండే లీలా వేషధారి అయిన శంభుడు, దుందుభినిర్హ్లాదుని ఆలోచనలను చదివి, అక్కడ ప్రత్యక్షమై, రాక్షస రాజుని, తన బాహువులలో బంధించి, వజ్రాయుధం కన్నా శక్తివంతమైన తన పిడిగుద్దులు కురిపించారు. ఆ పిడిగుద్దుల ధాటికి, పెద్ద కేక పెడుతూ దైత్యరాజు, చనిపోతాడు.*
*దైత్యరాజు పెట్టిన కేక విని, చుట్టుప్రక్కల వున్న బ్రాహ్మణులు, మునులు, ఋషులు అక్కడకు వచ్చి, వృషభవాహనుని బాహువులలో బందీ అయి, చనిపోయి వున్న దైత్యరాజు దుందుభినిర్హ్లాదుని చూచి, తమ బాధలు తీరాయి అని, చంద్రచూడుని పరి పరి విధాల కీర్తించారు. వారి, ప్రార్థనలు విన్న ఉమాపతి, వారందరకూ అభయం ఇచ్చి, "నా ఈ వ్యాఘ్రేస్వర లింగ రూపాన్ని దర్శించిన వారందరూ, మోక్ష ప్రాప్తి కి అర్హులు అవుతారు" అని పలికి కైలాసానికి ప్రయాణం అయ్యారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి