జయ జయ జయ జయహో*ఇస్రో ;-కేశరాజు వేంకట ప్రభాకర్ రావు -పాతర్లపాడు, ఖమ్మం.6281697982
ఎగపోస్తున్నాయి ఆ క్షణాలు, 
సెగల ఎదలో ధగధగ మెరుస్తూ, మలుగుతూ !
గగన వీధిలో గమ్యాన్ని వెతుక్కుంటున్న
విక్రమ్ లాండర్, చంద్రుని స్పర్షించి హర్షించాలని కోరుతూ!!

మహా సంకల్పం చేసి, నిరంతర కృషితో 
సోముని పై దిగాలని సోముడు వదిలిన పాశుపతం !

 మహా చంద్రయాన్ మహోజ్వల కాంతులతో
అఖిలాండకోటికి బ్రహ్మాండ నాయకుడిలా!!

నిర్విఘ్నంగా అజేయుడై, అజరామరంగా
చందమామ చంకనెక్కిన విజయుడు విక్రమ్!!
లోకమంతా లొట్టలు వేస్తూ, కట్టలు తెగి, 
ఉరుకులు పెట్టే ఉత్సాహంతో నింగిని చూస్తుంటే!!

అనైక్యతతో పరపాలనలో పరాభవించబడిన జాతి
వేయి సంవత్సరాల బానిసత్వం అనుభవించినా,
తన ఉనికిని మరువక, సనాతన వేదభూమి ఇస్రో,
ఇందుమామను ముద్దాడి మురిసిన క్షణాలు!!

టపటప రాల్చాయి, రెండు వందల ఎనభై కోట్ల
కనుదోయలు, ఆనందభాష్పాలు తమకంతో !
తమ పూజలు ఫలించాయని, కోరిక నెరవేరిందని,
తామూ, అగ్రగాములమే నన్న ఆత్మ గౌరవంతో

కామెంట్‌లు