జీవన పద్ధతి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఈ ప్రపంచంలోకి వచ్చిన మానవుడు  తన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి తన పద్ధతిలో పరిస్థితులను  ఏర్పాటు చేసుకుంటాడు తనను కని పెంచిన తల్లిదండ్రులను  విద్యాబుద్ధులు నేర్పిన  గురువులు, సహ ధర్మచారిణి గా తనకు సకల సౌకర్యాలు అందిస్తున్న భార్యను  తన సంతానాన్ని తప్ప మిగిలిన ప్రపంచం ఏది తనకు పట్టదు  వీరంతా సుఖంగా ఉండడానికి ఏం చేయాలి  అన్న ఆలోచన తప్ప  మరొకటి లేదు  ఉండడానికి ఇల్లు  శరీరానికి కాపాడుకోవడానికి బట్ట  జీవితాన్ని గడపడానికి ఆహారం ముఖ్యం  వాటిని సంపాదించే పనిలో  రకరకాల  పద్ధతులను అవలంబించడం  వాటిలో కొన్ని  జయప్రదం కావచ్చు  మరి కొన్ని కాకపోవచ్చు  దానివల్ల వాడికి నిరాశే మిగలవచ్చు  ఇది మామూలుగా ప్రతి ఒక్కరు ఆలోచించే విషయం.
మనిషి జీవించడానికి అనేక మార్గాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి  అయితే ఏ మార్గాన్ని ఎవరు అనుసరించాలి దానిని ఎలా ఎన్నుకోవాలి  అన్నది సందేహం  టు డు  ఆర్ నాట్ టు డు  అంటాడు షేక్స్పియర్  ఇది చేయడమా మానుకోవడమా చేస్తే ఏ లాభాలు ఉన్నాయి చేయకపోతే ఏ నష్టాలు ఉన్నాయి  ఈ రెంటినీ తులనాత్మకంగా ఆలోచించి  తన నిర్ణయం తీసుకోవడం సబబు అయితే  అతనికి ఆ నిర్ణయాత్మక శక్తి ఉన్నదా లేదా అన్నది సందేహం  నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల  నాకు మంచి జరుగుతుందా ఇతరులకు మంచి జరుగుతుందా అని ఆలోచించేవారు ఉన్నారు  దీనివల్ల సందిగ్ధంలో  కాలాన్ని మర్చిపోతాం  ఆ కాలం మన కోసం ఆగదు కదా  టైం అండ్ టైడ్  వెయిట్ ఫర్ నో మ్యాన్ అన్నది శాస్త్రం. హనుమంతుడు అంటేనే బుద్ధికి  పెట్టింది పేరు  ఎలా మాట్లాడాలో ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో ఎందుకు మాట్లాడాలో  మాట్లాడేటప్పుడు ఎలా ప్రవర్తించాలో  అన్నీ ఆంజనేయునికి తెలిసినట్లుగా ప్రపంచంలో ఎవరికీ తెలియదు అని ఆదికవి వాల్మీకి మహర్షి  కితాబు ఇచ్చారు  కానీ సీతమ్మ వారిని వెతకడానికి వెళ్ళినప్పుడు  ప్రతి అంగుళాన్ని పరిశీలనగా చూస్తూ  చివరకు మండోదరి గదికి వెళ్ళినప్పుడు  ఆమెను చూసి  అంత క్రితం సీతమ్మవారిని చూసిన దాఖలాలు లేవు అమ్మవారు ఎక్కడ ఉన్నారు  అతని మనసును తునా తునకలు చేసింది  బుద్ధి పనిచేస్తుంది కనుక ఆ మహా పతివ్రత ఇలాంటి నీచుని గదిలో ఎందుకు ఉంటుంది  అని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నాడు.



కామెంట్‌లు