బంధాలకు బారికేడ్ లు
ఏమీ లేవు...
మనం కలుపుకున్నవే బంధుత్వాలు...
మనకు నచ్చిన వారే
చుట్టాలు....
పరాయి వాళ్లంటూ
వేరే ఎవ్వరూ లేరు
అందరూ మన వాళ్లే...
స్నేహితులను
వెతుక్కోవాల్సిన పనేలేదు
సోషల్ మీడియా ఎకౌంటు ఒక్కటి సరిపోతుంది...
జాలరి వలలోకి వచ్చి
చేపలు చిక్కుకున్నట్లు
అందరూ ఇక్కడే ఏకమవుతారు...
మెజీషియన్ మంత్రం
వేసినట్లు ఆన్లైన్లో క్షణాలన్నీ ఇట్టే మాయమయ్యే ట్రిక్ ఏమిటో మరీ...
ఇప్పుడన్నీ
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్
స్నేహాలే అందుకే కాబోలు....!
చేతివేళ్లతో నోట్ ప్యాడ్ లో మాటల రాగాలు పలికిస్తూ,
గుడ్ మార్నింగ్ పోస్ట్ లతో
ఉదయాలకు స్వాగతాలు పలుకుతూ....
భావోద్వేగాలను స్టేటస్ లుగా
పెట్టి, మనసులోని భావాలను
చిత్రిస్తూ...
కోట్స్ రూపంలో అభిప్రాయాలను..
ఫోటోల రూపంలో
ఆనందాన్ని ప్రకటిస్తూ...
ట్రెండ్ ని ఫాలో అవుతుంటారు...
నచ్చిన వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెడుతూ
నచ్చని వారిని అన్ ఫాలో అవుతూ..
లైక్ కొట్టి ఇష్టాన్ని తెలుపుతూ,
కామెంట్ తో కాంప్లిమెంట్స్ అల్లుతూ సంతోషాన్ని షేర్ చేస్తుంటారు...
సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో
గజిబిజిగా బిజీ బిజీగా
ఉంటూ...
రియలిస్టిక్ లైఫ్ ను సినీమేటిక్ గా చూపే
ప్రయత్నాన్ని చేస్తుంటారు...
హాష్ ట్యాగ్ ల సంబరాల మధ్య యువత భవిష్యత్తు భద్రమేనా అంటే...ఏమో మరీ...!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి