రాయడం ఎలా;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 కొంతమంది ఏదో రాయడానికి  కూర్చుంటారు  ఈ సమాజం మొత్తాన్ని ఒకేసారి మార్చడం కోసం  తాము రచనలు చేస్తున్నట్లుగా  భావించి ఆ అభిప్రాయాన్నే వెల్లడిస్తారు  నాలుగు అక్షరాలను కలిపి పదాలతో వాక్యాన్ని నిర్మించడం అన్నది అంత సులువైన విషయం కాదు అన్నది కలం చేతపట్టిన తర్వాత తెలుస్తుంది  ఒక్క అక్షరం కూడా ఆ  కలం కాదపలేదు  ముందు అతను ఏమి వ్రాయదలుచుకున్నాడో దానిని గురించిన ఆలోచన ఉండాలి  కథ వ్రాయాలో నాటకం రాయాలా  వ్యాసమా సంభాషణా ఏమిటి  ఏ ప్రక్రియ ద్వారా  మీ రచనలు చదివే వారి మస్తిస్త్కాల్లోకి  మంచి విషయాన్ని సరఫరా చేయదలుచుకున్నావో  దాన్ని గురించి నీ మనసులో నీవు ఆలోచించుకోవాలి  దానిపై పూర్తి అవగాహన కలిగిన తర్వాత  కాలాన్ని కదపాలి.
నీ వేదైనా రచన చేయడానికి కూర్చున్నప్పుడు  నీ అంతట నీవే ఆలోచించుకో  ఈ రచన చేసే సామర్థ్యం నాకు ఉన్నదా లేదా  నేనెప్పుడైనా మంచి గొప్ప రచయితల లేదా కవుల రచనలను చదివానా  రాముడు చరిత్ర రాసిన వాల్మీకి మహర్షిని గురించి కానీ  కౌరవ పాండవులను గురించిన  వ్యాసమహర్షి గురించి గానీ  ఏ ఒక్క అక్షరమైనా తెలుసా  అద్భుతమైన కవితా ఖండికలను అందించిన  జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచన చూసావా కనీసం  ఘంటసాల వారు పాడిన పాటలే సర్వస్వం అనుకుంటున్నావా  కాళిదాసు రాసిన ఎన్ని కావ్యాలను ఆంగ్లంలో అనువదించారు  వాటిలో ఏ ఒక్క దానినైనా  చదవకపోయినా చూడడమైన జరిగిందా అన్న విషయాలను ఆలోచించుకో కనీసం విష్ణుశర్మ గారు రచించిన  మిత్రలాభం మిత్రభేదం లాంటి పుస్తకాలలో ఉన్న కథల నైనా  చదివావా  వారి రచన నీకు అర్థం కాకపోవచ్చు దానిని తెలుగులో అనువదించిన  పరవస్తు చిన్నయ సూరి గారి  తెలుగు అనువాదమైన చూశావా  ఏ ధైర్యంతో కలం పట్టాలనుకున్నావ్ భజన తెలియదు ప్రసంగం తెలియదు   చర్చ అంటే ఎవరెవరికి జరిగే  పద్ధతో అర్థం కాదు గోష్ఠి ఎలా ఉంటుందో నీవు ఎప్పుడైనా వచ్చి చూసావా  కనీసం సంగీత జ్ఞానం  నీకు లేకపోవచ్చు  ప్రకృతి నీకు చెవులిచ్చిన పాపానికి విన్నావా  ఆ  అన్నమయ్య అక్షరాలు  త్యాగరాజు కీర్తనలు  లేదా కనీసం జానపద గీతాలు అయినా వెళ్లావా  అవేవీ లేకుండా ఏదో కలం చేతబడితే  జ్ఞానపీఠ బహుమతి పొందిన విశ్వనాథ సత్యనారాయణ గారి స్థాయిలో ఉండాలని  కలలు కంటే కుదురుతుందా  నీ అంతట నీవే ఆలోచించు తెలుస్తుంది.


కామెంట్‌లు