నలుగు గోడల గదే వారికి గడియారం
అక్కడంతా గంటలలోనే
సాగుతుంది వ్యవహారం
చిమ్మ చీకట్లలో మిణుగురులై మగవారిని
ఆకర్షిస్తూ
అనువైన అందంతో పదువురికి ఆనందాన్ని అందిస్తూ
రోజులన్నిటిని రేయిలోనే గడిపేస్తూ
బ్రతకలేక, చావలేక, ఉండలేక, వీడలేక
ఇష్టంలేని కష్టాలను అనుభవిస్తూ
వెలివేసిన, విలువలేని జీవితాలలోనే బ్రతుకు పోరాటం సాగిస్తూ
కడలై కదులుతున్న కన్నీటితో కల్లాపి చల్లుతూ
రహస్యపు గాయాల రక్తపు చుక్కలతో ముగ్గులు గిస్తూ
నిశి నీడలో నవ వేకువ కోసం ఎదురుచూస్తూ
బందీలైన కన్నె ముతైదులు వారు…

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి