అభేదం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 నేను-నీవు, నీవు నేను- 
ఇరువురం భిన్నులం
తనువుల్లో మనసుల్లో-
కానీ ఇప్పుడు తనుపుల్లో 
విభిన్నత్వం మనసుల్లో-
అభేతత్వం నీవేమి
చేయమన్నా దానిని- 
చేస్తున్నాను నేను
నీ ఇష్టమే నా ఇష్టం-
నీ ఆనందమే నా ఆనందం
నీ పలుకే నా పలుకు-
నీవే సమస్తము నాకు
చంద్రునిలో చంద్రికలా-
పూవులో తావిలా
రవిలో వెచ్చదనంలా - వెన్నెల్లో చల్లదనంలా
పాటలో పల్లవిలా-
శబ్దంలో 
పచ్చికలో పచ్చదనంలా- పక్షికి రెక్కల్లా 
గగనంలో నీలిమలా-సముద్రంలో కెరటాల్లా
పర్వతంలో ఉన్నతత్వంలా- పాలలో తెల్లదనంలా
కుంకుమలు ఎర్రదనంలా- బంగారంలో పచ్చదనంలా
సింగారంలో వయ్యారంలా- అధరంలో మధురంలా
మనిషిలో ప్రాణంలా- ఎప్పుడూ కలలో కూడా 
మరు జన్మలో కూడా- ఎడబాయక ఉందామా మైమరచి పోదామా...


కామెంట్‌లు