బాల్యం లోనే మనకు పెద్దలు భారతంలో చిన్న కథలను రామాయణంలో ఒక కథను పిట్ట కథలాగా భాగవతంలో ఉన్న శ్రీ కృష్ణుని లీలలు మన మనసుకు అర్థమయ్యే రీతిలో చెప్పడం దానివల్ల అలాంటి పాత్రలలో మనం జీవిస్తే ఎలా ఉంటుంది అలా అనుకుంటే చిన్నతనంలోనే ఆ భావాలు రావడం ఒక్కొక్కసారి వ్యక్తుల మనస్తత్వం వలన మార్చగలిగిన శక్తి ఆ రచనకు ఉంటుంది ఒక వ్యక్తి ఏదైనా ఒక మార్పును తేవడానికి నిర్దేశించుకున్నప్పుడు అది తప్పు ఆ మార్గంలో అనేక కష్టనష్టాలు ఉంటాయి అన్న విషయాన్ని రచన ద్వారా తెలుసుకున్నవాడు ఆ మార్గాలకు వెళ్లడానికి మనస్కరించుకునేవాడు కాదు కొత్త మార్గాన్ని అన్వేషించుకుంటూ ఏది తన జీవితానికి అనుకూలంగా ఉంటుందో దాని కోసం ప్రయత్నం చేస్తాడు అలా పుస్తకాలు మనకు మార్గాన్ని చూపుతాయి ఒక రకంగా మార్గదర్శకాలు అనవచ్చు. ఎక్కువగా పుస్తకాలు చదివే వారిలో వచ్చే గొప్ప అనుభూతి విశ్లేషణాత్మకంగా చదవడం ఒక రచయిత ఒక పాత్రను సృష్టించినప్పుడు ఆ పాత్రకు కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి దానిని దాటి చెపితే ఇది అతిశయోక్తి చేస్తున్నాడు రచయిత అన్న విషయం నీకు స్పష్టంగా అర్థం అవుతుంది అలా ఒక పుస్తకాన్ని హేతుబద్ధంగా చదవడానికి అలవాటు పడుతుంది మనసు కొన్ని పుస్తకాలు మనకు కావాల్సిన ఎంతో మంచి సమాచారాన్ని మరి ఎన్నో చక్కటి ఆలోచనలను రేకెత్తించే దృక్పథాలని కలిగిస్తాయి అలాంటి పుస్తకాలను ఎన్నుకొని వాటిని చదివినట్లయితే చదువరికి ఎంతో తృప్తి కలుగుతుంది ఆ సమాచారానంత విశ్లేషించి మనకు ఎంత కావాలో అంతవరకు గ్రహించే నేర్పు కూడా ఆ వ్యక్తికి తెలిసి వస్తుంది కనుక పుస్తకం చదివే అలవాటు పెంచుకోండి.
కొంతమందికి పని ఒత్తిడి వల్ల ఎలాంటి పనులు చేయలేకపోవడం బాగా ఆలోచిస్తున్న వారికి ఏది ఎలా నిర్ణయించుకోవాలో తెలియకపోవడం అలా అమాయక స్థితిలో ఉన్నప్పుడు పుస్తక చదవడం వల్ల ఎంతో ఒత్తిడి తగ్గటానికి మార్గాలని సూచించడానికి ఇది కారణం అవుతుంది నువ్వు చదవటం మొదలు పెట్టిన తర్వాత ఆ పాత్రలలో లీనమైపోయి నీ దృష్టి దాని మీదే వున్నప్పుడు నీ మానసిక ఒత్తిడి నీకు జ్ఞాపకం ఉండదు ఆ దృష్టిలో కూడా పుస్తకం ఎంతో అవసరం దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది సంగీతం వినడం కన్నా పుస్తకం చదవడం వల్ల వచ్చే మానసిక విశ్రాంతి ఎక్కువగా ఉంటుంది కనుక ఎప్పుడు చీకాకులో ఉంటే అప్పుడు పుస్తకాన్ని తెరవడం అలవాటు చేసుకోండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి