నడవడిక;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.6302811961.
 మాటలు చెప్పడం వేరు  దానిని చేతలలో చూపడం వేరు  యువత అంటేనే ఉద్రేకంతో కూడిన మనసులు కలిగిన వారు  సముద్రపు తరంగాలు వేరు నది తరంగాలు వేరు  ప్రశాంతంగా వెళ్ళిపోయేది నది  దానిపై వచ్చే అలలు కూడా ఎవరికీ హాని కలిగించకుండా  నీటిని ముందుకు తీసుకువెళ్లడానికి మాత్రమే  ఉపయోగపడుతుంది  సముద్రపు తరంగం అలా కాదు  ఒక్కొక్కసారి వ్యక్తులను కూడా తనతో పాటు లోపలికి తీసుకెళ్ళిపోతుంది  కొంతమంది బ్రతికి బయటపడవచ్చు  ఎక్కువమంది చనిపోవడం జరుగుతుంది  క్రమశిక్షణ కలిగిన యువత ఎప్పుడు  తనకు సమాజానికి మంచి చేయడానికి మాత్రమే పనిచేస్తుంది  ఉద్రేకంతో ఉన్న యువత  ఆలోచనా శక్తి సన్నగిల్లి  వారు తీసుకునే నిర్ణయాలు భావోద్వేగంతో కూడినవై ఉంటాయి.
మన భాషలో ఉద్వేగం వేరు, ఉద్రేకం వేరు. అవతల వారికి విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం కోసం కొంచెం ఉద్వేగంతో చెప్పడం అవసరం కూడా అవతల వారిని ఒప్పించడానికి  ఆతత్వం సరైనదే కానీ ఉద్రేకం ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అది ఆ పరిస్థితులకు అనుగుణంగా మనసు చేసే పని  మాటలతో  ప్రారంభించి చేతలతో ముగిస్తుంది  ఒక్కొక్కసారి హత్యలకు దారి తీయవచ్చు  లేక ఆత్మహత్యలకు  ప్రేరణగా ఉండవచ్చు  కనుక ఉద్రేక స్వభావం కలిగిన ఎవరు కూడా  సరి అయిన నిర్ణయాలు తీసుకోలేరు  మనసులో తీసుకోవాలన్న అభిప్రాయం కలిగినా ధర్మబద్ధమైన  న్యాయపూరితమైన  ఆలోచనకు ఆస్కారం ఉండదు  ఆ పరిస్థితి అలాంటిదే.
అయితే వారిని క్రమశిక్షణతో నడిపించగలిగిన  యుక్తిపరుడు  పరిణతి చెందిన  ఆలోచన కలిగిన వ్యక్తి  నాయకత్వాన్ని వహించి  నడిపించినట్లయితే  యువ రక్తం  పొంగును  ఆపి  ప్రస్తుత స్థితిని అర్థం చేసుకొని వారు చేయబోయే కార్యక్రమం మంచి చేస్తుందా చెడు చేస్తుందా అన్న  చర్చ తనలో తానే చేసుకొని  ఎలాంటి ఇబ్బందులు కలుగవు దీని వలన మంచి మాత్రమే జరుగుతుంది  అన్న విషయం  స్పష్టం అయిన తరువాత  దానిని కార్యరూపంలో చూయించినట్లయితే తప్పకుండా విజయాన్ని సాధించి తీరతారు  నిజానికి యువకులలో ఉన్న శక్తి సామర్థ్యం  వయస్సు పెరిగిన వారిలో ఉండదు అన్నది అందరికీ తెలిసిన విషయమే  నియమ నిబంధనలకు లోబడి పని చేసే ప్రతి యువత  సమాజాన్ని నడిపించడానికి ముందుకు వచ్చి తీరాలి అన్నది నా అభిప్రాయం.



కామెంట్‌లు