ఫ్రాయిడ్ ఆలోచన;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 జీవితం అన్న తర్వాత కష్ట సుఖాలు రెండూ ఉంటాయి  విపరీతమైన బాధల్లో ఉండి  ఈ జీవితం ఇంతకుమించి మరేది ఉండదేమో అని విరక్తి చెంది  ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమైన వ్యక్తులు కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారికి మానసిక విశ్లేషకులు  కొన్ని రోజులు  వారిని దగ్గర కూర్చోబెట్టుకొని  అనేక ఉదాహరణలతో  పాటు తన దగ్గరకు వచ్చిన మిగిలిన  వ్యక్తులను పరిచయం చేస్తూ వారి బాధలను కష్టాలను  తెలియజేస్తూ  వీరందరూ  విరక్తి చెందిన వారే  అంత మాత్రం చేత జీవితంలో వారు  ఆత్మహత్యలు చేసుకోవడం కానీ ఎదుటివారిని హత్య చేయడం కానీ చేసే స్థితికి దిగజారుతారా  జీవితంలో అది అవసరమా  నీ అంతట నీవే ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా  అని అతని మనసుకు అర్ధమయ్యే పద్ధతిలో చెబుతారు.
కొంతమంది వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు  వారు ఎన్ని పద్ధతులను మారుస్తూ ఉంటారో చెప్పలేము. ఏ ఒక్క ఉద్యోగము  ఒక సంవత్సరం  పాటు చేసిన దాఖలాలు ఎక్కడా మనకు కనిపించవు  ఏదో ఒక  లోపం కనిపించడం  ఆ ఉద్యోగం వదిలేయడం  దానివల్ల ఎవరు బాధపడతారు తనే కదా  దానితో జీవితంలో కొత్త మార్గంలో వెళ్లడం కోసం ప్రయత్నం చేస్తాడు  ఆ మార్గం ఏమిటి ఎలా చేస్తే అక్కడి విజయాన్ని సాధించగలం అని ఆలోచన కూడా చేయలేని  పరిస్థితుల్లో అతను ఉంటాడు  అతనికి అనుకూలంగా  అతను ఏది చేస్తే అతని జీవితంలో  విజయాన్ని సాధించడానికి అవకాశాలు ఉంటాయో  దానికి సంబంధించిన పుస్తకాలను చదివి  ఆ పద్ధతులకు కట్టుబడి  పనిచేస్తే తప్పకుండా  విజయాన్ని సాధించగలరు  అని చెప్తున్నాడు యంగర్ స్సాల్ సిగ్మాండ్  ఫ్రాయిడ్  సిద్ధాంతాలు తెలియని వారు అరుదు  ఆంధ్రులు కూడా అనేకమంది వారి రచన గురించి ఉదాహరణలు ఇస్తూనే ఉంటారు  ఆయన పుస్తకాలను గురించి  తన అభిప్రాయాన్ని చెబుతూ  ప్రతివాడు ఉదయం లేచిన తర్వాత వ్యాయామం చేయాలి శరీరానికి చాలా అవసరం  ఎక్కువ కాలం జీవించడానికి  అది పనికి రావడమే కాకుండా  శరీరానికి ఎలాంటి రుగ్మతలు రావు అన్నాడు. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో  మనసుకు కూడా అంతకు మించిన వ్యాయామం ఉండాలి  లేకపోతే దాని ఆలోచన శక్తి మసిబారిపోతుంది  పనిచేయదు  దానికోసమైనా  చక్కటి పుస్తకాలను ఎన్నుకొని తప్పకుండా చదవవలసిన  అవసరం ఉంది  అది చదివిన తర్వాత ఆ విషయాలు నువ్వు మరి కొంతమందికి కూడా చెప్పడానికి  ఆస్కారం ఉంటుంది  అంటూ పుస్తకాలు చదవడం వల్ల వచ్చే  మంచి గురించి అనేక మంది అనేక రకాలుగా మన ముందు తమ అభిప్రాయాలను ఉంచారు  అది మీకు తెలియాలన్న అభిప్రాయంతో నేను రాస్తున్నాను.


కామెంట్‌లు