రాఖీ పౌర్ణమి;- గాజుల నరసింహ-9177071129
ఆత్మీయతల వెల్లువతో  వచ్చింది  రాఖీ పౌర్ణమి
కష్టాలు ఎదురైనా కన్నీళ్లు వచ్చినా ప్రేమను పంచు పండగ

అన్నా చెల్లెలకు అక్కా తమ్ముళ్లకు
ఆశీర్వాదములిచ్చు అందించు ఆత్మీయ పండగ
మురిపాలు తోడుగా బంధాలు నీడగా నిలిచిన పండగ


హైందవసంస్కృతికి ప్రతీకగా సోదర భావానికి సాంకేతముగా
మూడు పువ్వులు ఆరు కాయలతో
కళ కళ కాంతుల సౌభాగ్యాలతో అల్లరించి పండగ

పసిడి మోము మగువల నువ్వుల పూలు పూయించే పండగ
కల కాలం ఒకరికి ఒకరు తోడుండే పండగ


శ్రావణ మాసంలో వచ్చింది కుల మత వర్గాలకు అతీతమై
రాగ బంధాలకు అనుసంధానమై పవిత్రమై
పలువురిని పలుకరిస్తూ ఆనందాలు వెదజల్లుతూ
పూల వనంలా

అల్లుకుపోయే పండగ
ఈ రాఖీ పండగ సమస్త లోకానికి పండగ...


కామెంట్‌లు