గజేంద్ర మోక్షం
============
త్రికూట మనెడి వనమున 1
నివసించుచు మధురమున
తెలిపెను జగమును గజము
భాగవత పురాణము
త్రికూట మనెడి పర్వతము 2
తెలుపును మనలోని గుణము
సత్వ రజో తమములచే
స్థితిగతి జీవిత అర్థము
పసిడి వన్నెతో శిఖరము 3
వెండి తోడ నొక శిఖరము
ఉండె పాలసంద్రమున
ఇనుము తోడ నొక శిఖరము
ఈ పర్వత అరణ్యమున 4
జంతువులెన్నో యుండిన
గజేంద్రుని గుంపు ముందు
నిలవవట కేసరులైన
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి