ఆధ్యాత్మిక మణిపూసలు;- మమత ఐలకరీంనగర్- 9247593432
గజేంద్ర మోక్షం (5నుండి10)
=====================
పది లక్షల కోట్ల గుంపు
గజేంద్రునిదె ఆ సొంపు
అడవికి తానే రాజుగ
ఏనుగు బలగంతొ ఇంపు

సమూహాలకధిపతి
భోగభాగ్యముల స్థితి
తన పరివారంబు తోడ
ఆనందమె ఆ స్థితి

అరణ్యమును వర్ణించగ
లేనివి లేవట చూడగ
పూలు పండ్లు కాయలట
పచ్చదనం విలసిల్లగ

రకరకాల పక్షులతో
వింత వింత మృగాలతో
నిండైన అరణ్యము
జంతు వర్గ జాతులతో

అంతట నిండిన ఆత్మ
సర్వంబెరిగిన ఆత్మ
విశ్వ వ్యాప్తి అనంతుడు
తానే గద పరమాత్మ

సృష్టిలోన జరుగుచున్న
వృష్టికి కారణంబున్న
స్థితి గతులను సవరించుచు 
నడిపించును సృష్టినన్న


కామెంట్‌లు