ఆధ్యాత్మిక మణిపూసలు;- మమత ఐల-కరీంనగర్-9247593432
గజేంద్ర మోక్షం (17 నుండి 21)
=======================
అంతటి యా గజేంద్రుడు
దారి తప్ప నట్టి వాడు
మలుపు తిరిగి దప్పికకు
విధిరాతకు జిక్కినాడు

కొత్త కొలనుకేగినాడు
మంచి నీరు త్రాగినాడు
అంతటితో తిరిగి రాక
చిత్తు చిత్తు జేసినాడు

వింత వింత చేష్టలతో
నీరు పీల్చ తొండముతో 
గట్టు నున్న భార్యలపై
చిమ్ముచుండె సరదాతో

కొలను లోని పూలను
తొండముతో తెంపెను
కొలనంతా తొక్కుకుంటు
భార్యలపై విసిరెను

సయ్యాటల సొంపుతో
అవి సైతం రాజుతో
పూవుల పుప్పొడి నంతా
చల్లుచుండె ఇంపుతో


కామెంట్‌లు