గజేంద్ర మోక్షం (22 నుండి 27)
----------------------------------------
కొలను దాపు చెట్లను
తొండముతోనూపెను
ఇటూ అటూ దొర్లుతూ
విద్వంసం చేసెను
అంతటితోనాగకుండ
నీటిని తొండంబు నిండ
పీల్చుకోని తొండమెత్తి
చిమ్మె పైకి వదలకుండ
నీటి తోడ పీతలు
అవే గాక చేపలు
తొండమున తేలు మరియు
చేరె చిన్న మొసలులు
నీటిని నింగికి జిమ్మగ
ధాటిగ అవి పైకెగరగ
సూటిగ పడిపోయెనట
వాటి రాశిలో చక్కగ
చేప మీనమందున
తేలు వృశ్చికంబున
కర్కాటకమందు ఎండ్రి
మొసలి మకరమందున
గజరాజు అడుగులు
వేయగ జలజీవులు
నలిగిపోయి ఎన్నెన్నో
వదిలెను ప్రాణంబులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి