శివమయం పాట
ఉ...ఉ...ఉ...ఉ...ఉఉఉఉఊ...
=====================
శివ నామంబును గొలువ
మీ చింతలు బోవును లెండి!
శివ సత్తలకీజగమందు
ఆనందంబట చూడండి! //2//
ధరలో ధర్మంబంత తన బాటే నడవాలండి.
తను నడిపే న్యాయం
చేసే నర్తన ఆగదు ఇక లెండీ..!
తను నడిపే న్యాయం
చేసే నర్తన ఆగదు ఇక లెండీ..!
//శివ//
తన ఒంటిని రెండుగజేసి
సతికిచ్చిన బాట ఇదండి
ప్రతి ఇంటికి తానెజమానై
శివమెత్తిన సత్యమిదండి
న్యాయానికి ఊపిరిగా
నమ్రతగా నవ్విస్తాడు
సత్యంబును జూపించ
సరసననే కొలువుంటావు
తన నమ్మిన వారికి
తండ్రిగ తానై దిగివచ్చేనండి
ఆ కాలమునైన కట్టిపడేసే ఘనతే తనదండీ..
//శివ నామంబును గొలువ
మీ చింతలు బోవును లెండి!
శివ సత్తలకీజగమందు
ఆనందంబట చూడండి! //2//
ఏ దిక్కనచూసిననూ
తను చుక్కగ మెరిసే నండి.
సర్వంబు శివమయమే
అవమానంబిక లేదండి.
ఆ పార్వతి మాతవలె
కాళిక రూపంమీదండి
మహిలలనీ లోకమున
శివశక్తిగ బిలిచేరండి.
ప్రకృతి మాతకు పర్వదినంబై
తానుండేనండీ....
పదిమందిలనైన పరమాత్ముడిని
నమ్ముచు దలవండీ...
//ధరలో ధర్మంబంత తన బాటే నడవాలండి.
తను నడిపే న్యాయం
చేసే నర్తన ఆగదు ఇక లెండీ..! //
ఆ....ఆ....ఆ...అ..అ...ఆఆఆ...
ప్రతి దీపంనందు దాపున ఉండే
దైవంతానండి.
ప్రతి కోవెలనందు కలుగమారే
తల్లులు వినరండీ...
శివలీలల మహిమ
చిత్తమునందు వికసించాలండీ...
అవమానంబన్నది లేక
గౌరతనే పొందడీ...
ఈ ధరకే తోబుట్టువుగా
ఆ గణపతి కొలుండంగ
ప్రతి వనితకు స్వర్గంబే
అవమానంబికలేక లేదండి.
తన బాటే నడవాలండి.
తను నడిపే న్యాయం
చేసే నర్తన ఆగదు ఇక లెండీ..!//
తన ఒంటిని రెండుగజేసి
సతికిచ్చిన బాట ఇదండి
ప్రతి ఇంటికి తానెజమానై
శివమెత్తిన సత్యమిదండి
//శివ నామంబును గొలువ
మీ చింతలు బోవును లెండి!
శివ సత్తలకీజగమందు
ఆనందంబట చూడండి! //2//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి