ఆధ్యాత్మిక మణిపూసలు;-మమత ఐల-కరీంనగర్-9247593432
గజేంద్ర మోక్షం (81 నుండి 85)
========================
మకరము జలమునకు లాగ
ఏనుగు గట్టునకు లాగ
ఇరువురి పోరాటంలో
పట్టు విడుపు లేదెలాగ

ఏండ్ల కేండ్లు గడచుచుండె
కరి బలంబు తగ్గుచుండె
జలజీవము కాదు గాన
ఓపిక నశియించు చుండె

మకరికి చంపుట ఇష్టం
విడువక పట్టుటె కష్టం
దొరికిన ఆహారంబును
వదులుట ఎంతటి నష్టం

వదిలించుట కరికిష్టం
వదలదు అది మకరిష్టం
అదును జూసి పైదుముక
ఏనుగు శక్తికి నష్టం

వీడిన పరుగెట్టుదునని
ప్రయత్నించుచు జారుకొని
కరి బలము తగ్గి చిక్కె
నరనరాలు ముడుచుకొని



కామెంట్‌లు