శ్రావణ తులసి మహాలక్ష్మి;- బల్ల కృష్ణ వేణిపలాసశ్రీకాకుళం జిల్లా 9398905803

 శ్రావణమాసం అనగా లక్ష్మీప్రదమైన మాసము. సంవత్సరములు 12 నెలలలో శ్రావణమాసము అంటే మహాలక్ష్మికి చాలా ఇష్టం. విష్ణుమూర్తి జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం, తన భర్త నక్షత్రం తో వచ్చిన మాసము శ్రావణమాసము కాబట్టి శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం. శ్రావణమాసంలో లక్ష్మీ పూజ మరియు తులసి మాత పూజ స్త్రీలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. భారతదేశంలో అత్యంత ప్రాణప్రదంగా తులసి మాత పూజ చేస్తూ ఉంటారు ‌. ప్రతి ఇంటి ముంగిట తులసి కోట కొలువై ఉంటుంది. అది మన భారతీయత. ప్రతి మహిళ తను ఆచరించే నిత్య కృత్యముల బట్టే లక్ష్మీదేవి తన ఇంట ఉంటుంది. ప్రతిరోజు మహిళలు ఉదయాన్నే నిత్య దీపారాధన చేయాలి, ప్రతి ఇంటి ముంగిట తులసి బృందావనం ఉంచి తులసి పూజ చేసుకోవాలి, ఉదయం, సాయంత్రం సమయములలో పూజా మందిరంలో, తులసి కోట వద్ద దీపం వెలిగించాలి. దీపం మహాలక్ష్మి స్వరూపం.
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం..... అంటూ స్తోత్రం చేసి ప్రార్థన చేసుకోవాలి. లక్ష్మీదేవికి పసుపు,, కుంకుమ, పువ్వులు, దీపం, పాలు, పండ్లు తో పూజ చేసుకోవాలి. ఎంత ఆడంబరముగా చేసామన్నది ముఖ్యం కాదు, భక్తి ముఖ్యము. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి బంగారు పూలు తెచ్చి చేసినా ఆవిడకి అవసరం లేదు, మనసులో భక్తి ముఖ్యము. మానవులు శుచిగా, ఇంటిని శుభ్రతగా, మనసుని శుభ్రతగా, సత్ప్రవర్తనతో, మంజుభాషిని గా, సహనముగా, సరళంగా మాట్లాడడం, ఇలాంటి గుణములు కలిగి ఉండడం లక్ష్మీప్రదము. అటువంటి వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.
భర్త మాటకి ఎదురు చెప్పడం, ఇంటిలో తగాదాలు తరచూ పడడం, ఇతరులపై చాడీలు చెప్పడం, చీటికిమాటికి నవ్వడం, దానగుణం లేకపోవడం, అత్తమామలపై చిర్రు బుర్ర లాడడం, ఇలాంటి వారి గృహం రుద్రభూమి గా ఎంజి ఆమె అడుగు పెట్టదు అని లక్ష్మీ పురాణంలో చెప్పబడింది. అందుకే ప్రతి మహిళ ఇది గమనించి మెలగవలెను.
తులసి మాత ప్రత్యేకత.....‌
నమో తులసీమాత.. ఓ విశ్వ పావని....
నమో జగజ్జనని.... ఓ లక్ష్మీ ప్రదాయిని....
తులసి మాతను ఆది నుండి దేవతలు, మరియు ఈనాటి మానవులు కొలుస్తూ ఉంటారు. శ్రీకృష్ణతులాభారంలో కృష్ణునికి తులాభారం వేసి కొనాలని సత్యభామ ఇంట్లో, ధనాగారంలో ఉన్న ధనము, బంగారము వేసి తులాభారం చేసినా తూగలేదు విష్ణువు. అప్పుడు రుక్మిణి దేవి తులసి మాతకి ప్రార్థన చేసి ఒక్క తులసీదళము తెచ్చి తులాభారంలో వేసేసరికి స్వామి తూగారు. విష్ణువుకి అంత ప్రీతికరము తులసి మాత.
తులసి ఔషధము కలిగిన మొక్క సైన్స్ ప్రకారం తులసి రసము చాలా జబ్బులని నయం చేస్తుంది. తులసి మాత గాలి పీల్చిన మంచి ఆరోగ్యము కలుగుతుంది. వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గిస్తుంది, ఆక్సిజన్ ని విరివిగా అందిస్తుంది ఈ తులసి మొక్క........
మాతా తులసి వందనము, మోక్ష దాయిని హరిచందనము
శ్రీమాతా శ్రీ తులసి రామ తులసి
జయములు మాకు ఇవ్వు కృష్ణ తులసి
తులసి మాత ప్రార్థన చేస్తే సౌభాగ్యము, ఆరోగ్యము ధనము నిండుగా కలుగును.
శ్రీ తులసి, ప్రియ తులసి జయము నీయవే...!!!
జయము నీయవే...........!!!
........... ఓం శాంతిః.......
__________________

కామెంట్‌లు