హరివిల్లు 131
🦚🦚🦚🦚
భగవద్దత్త ప్రకృతికి
చిత్ర విచిత్రాకృతులు...!
కుంచే అవసరం లేని
అత్యద్భుత ఆకృతులు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 132
🦚🦚🦚🦚
అప్పుడప్పుడు కొందరు
అదమరిచి తప్పటడుగులు...!
తమకు తాము వివేకులై
వేయాలి దివ్య అడుగులు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 133
🦚🦚🦚🦚
సంభాషణలు మొదలెట్టు
మొదటి వ్యక్తి అవ్వండి.......!
వాక్భూషణ వ్యక్తియై
సుపరిచితులుగ మారండి.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 134
🦚🦚🦚🦚
బడి ఒడిలోకి వెళ్ళాక
నడవడి నేర్చుకోవాలి.........!
తడబడు అడుగులు మాని
కలివిడిగ కలిసుండాలి........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 135
🦚🦚🦚🦚
నీవొకనాటి అపురూప
రూపాయి విత్తనానివి.....!
లక్ష్మీస్వరూపమైతివి........!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి