హరివిల్లు రచనలు,; - కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,- 9440522864.
 హరివిల్లు 136
🦚🦚🦚🦚 
ఒకే ఒక మాట వినండి
ఒక మొక్కను నాటండి
ఒకే మాటగ నడవండి
బ్రతుకు సూత్రం ఇదండి
🦚🦚🦚🦚
హరివిల్లు 137
🦚🦚🦚🦚 
ఆవలి ఒడ్డు చేరుటకు
భయానక సుడి గుండాలు.........!
ఒడుదుడుకుల ఎగుడుదిగుడు 
అలుపెరుగని అలల పరుగులు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 138
🦚🦚🦚🦚 
భారం మోయడానికి
చేతి సాయం అందించు..!
భారం దింపడానికి 
మనోధైర్యమునందించు..!!
🦚🦚🦚🦚
హరివిల్లు 139
🦚🦚🦚🦚 
నీ అందం నీతో 
ఉంటూ నను చేరింది....!
నా అందం గైకొని
నిను చేరుటకు వెళ్ళింది....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 140
🦚🦚🦚🦚 
శరీరానికి శిశిరం 
నేర్పును జీవన సారం....!
రాలే ఎండుటాకుల
త్యాగ చరిత విస్తారం........!!
  
                     (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు