హరివిల్లు రచనలు,-కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
హరివిల్లు 146
🦚🦚🦚🦚
సాయం చేయునపుడు 
హోదాను చూడమాకు....!
పదవి హోదా నెపంతో 
సాయం చేయుట మానకు....!!

🦚🦚🦚🦚
హరివిల్లు 147
🦚🦚🦚🦚 
అభినయ నయనాల
ఒయల కదలికలు.......!
పదాలకు అందని
ప్రణయ కలయికలు......!!

🦚🦚🦚🦚
హరివిల్లు 148
🦚🦚🦚🦚 
గాన మాధుర్యములను
గర్జనలో గ్రోలలేము..........!
గగన సొగసులను 
గదిలో బంధించ లేము......!!

🦚🦚🦚🦚
హరివిల్లు 149
🦚🦚🦚🦚 
ఉచిత పథకాలు
వడ్డించిన విస్తర్లు....!
తొలగిస్తే బతుకులు
తోలుబొమ్మల కబుర్లు..!!

🦚🦚🦚🦚
హరివిల్లు 150
🦚🦚🦚🦚 
తెల్లని పువ్వుల నవ్వులు
పున్నమి వెన్నెల మల్లెలు...!
నల్లని కలువల మొగ్గలు
చల్లని కన్నుల రెప్పలు.......!!
  
                     (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు