హరివిల్లు 151
🦚🦚🦚🦚
చంద్ర రేఖ చూడంగ
ఉప్పొంగె శివ గంగ.....!
గోవు పాలు పితుకంగ
నురుగుప్పొంగె వేగంగ...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 152
🦚🦚🦚🦚
వేకువ జామున మేల్కో
దేవాలయము చేరుకో.....!
పరమేశ్వరుని వేడుకో
ముక్తి మార్గము కోరుకో.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 153
🦚🦚🦚🦚
కలలో పూ ఊయలనై
మదిలో ముదమిగ ఊగాను...!
పున్నమి వెన్నెల వెలుగై
దిగులును దివికి చేర్చాను........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 154
🦚🦚🦚🦚
దేశ గౌరవ పిలుపులే
సహస్ర వజ్ర కవచాలు....!
దేశాభిమాన జనులకు
వజ్రోత్సవ కానుకలు........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 155
🦚🦚🦚🦚
నోటును పొదుపు చేసుకో
ఋణపాశము దరిచేరదు...!
మాటను అదుపు చేసుకో
శతృ శేషము కనబడదు.......!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి