హరివిల్లు రచనలు,;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 161
🦚🦚🦚🦚
మనో వీధిలో పీడ
కల *స్వైర విహారాలు*......!
మానసిక చింతనలకు
నిలువెత్తు *తార్కాణాలు*......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 162
🦚🦚🦚🦚 
చక్కని చుక్కల ముగ్గు
చూపరుల ఆకర్షించు....!
చూసి నడవమని చెప్పు
భాగ్య రేఖలను సృష్టించు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 163
🦚🦚🦚🦚
నిజ దానాలు లేని
వాగ్దానాలు యేల....!
నిజ లాభాలివ్వని
ప్రలోభాలు యేల......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 164
🦚🦚🦚🦚 
పొన్న చెట్టు కొమ్మ అన్న
కన్నయ్యకు అది ఇష్టం....!
పొన్న నీడ దోషాలను
హరించుట మన కదృష్టం...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 165
🦚🦚🦚🦚 
దిగుబడినిచ్చు, చింత
చిగురు చెట్టుకున్న చాలు...!
కరువు రాని స్వంత 
పొలము ఎకరమైన చాలు...!!
                        (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు