పంచపది సభ్య సమాజం! మాయని మచ్చ!;- డా.పివిఎల్. సుబ్బారావు, 94410 58797.
 నా పంచ పదుల సంఖ్య--
1006.
కురుసభ ద్రౌపది అవమానం,
 సభలో వీక్షణము!
అరణ్యవాసం సైంధవుడు, జరిపిన అఘాయిత్యము! 
అజ్ఞాతవాసం అనుక్షణం,
 కీచక కిరాతకత్వము,!
 "ప్రతిఘటన" క్లాసురూమ్,
 టీచరమ్మ మనస్తాపము! 
మణిపూర్ మానిని మానం, లోకానికి ప్రదర్శితము, పివిఎల్!
1007.
భారతీయులంతా ఒక్కటై, ఖండించాల్సిన దుర్మార్గము!
 
అధికార ప్రతిపక్షాలు ఏకమై, తేల్చాలి నేరము !
ఘటన ఓనేరం ,వ్యాప్తం ,
దాన్ని మీడియా మహానేరము!
మనం ఉన్నది,    
      ప్రజాస్వామ్యము,
              ఆటవిక వర్తనము! 
న్యాయస్థానం జాగు చేయక,     నేరస్తులను శిక్షించాలి ,
పివిఎల్!
_________


కామెంట్‌లు