పంచపది ,
=========
నా పంచ పదుల సంఖ్య
1016.
భూమి దాటి ఉపగ్రహం,
ఎగిరే త్రివర్ణ పతాకము!
శాస్త్రజ్ఞుల నిరంతర కృషి, తెచ్చే ఘన విజయము!
అంతరిక్ష రంగాన భారత్, తలఎత్తిన క్షణము!
ఈ సూర్యాస్తమయం,
చంద్రునిపై,
వెలుగుల ఉదయము !
చంద్ర మండల దక్షిణ భాగం,
భారత్ మోపే పాదము, పివిఎల్!
1017.
విక్రమ్ చక్రాలు వేస్తున్న, మూడు సింహాల గురుతులు !
చంద్రునిపై నిలిచే తరగని,
చెరగని ముద్రలు!
అందించు ఆ సమాచారము,
ఉపయోగం బహు రీతులు!
"యువత " శాస్త్రజ్ఞులు,
కావాలనే దీక్షకు పునాదులు!
అంతరిక్ష పరిశోధన, చంద్రయాన్మహాఅభియాన్, పివిఎల్!
_____'____
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి