పంచపది,
-------------
నా పంచ పదుల సంఖ్య---
1018.
సృష్టిలో స్త్రీ పురుషుల శారీరక, స"మానత్వం" లేదు!
అది వచ్చేస్తే మరిక భూమి, మీద సృష్టి జరగదు!
ఆది నుంచి వివక్షత ఖడ్గబలి, స్త్రీ మరిచిపోదు!
పురుషాధిక్యత సాక్ష్యం ,
చరిత్రలో మరి చెరగదు!
సంస్కృతి, సాంప్రదాయం,
స్త్రీ శక్తి పరిమితం, ఓరివాజు,
పివిఎల్!
1019.
స్త్రీ మేల్కొంది, వివక్షత, ఎదిరిస్తూ పోరాటం చేసింది!
విద్య నేర్చింది ,వివేకం, జోడించింది,ముందు నడిచింది!
రంగమేదైనా,
ధాటిగా దూసుకెళ్ళి,
మేటిగా ఉన్నది!
అమెరికా అధ్యక్ష,
రిచర్జ్ నిక్సన్ ప్రకటనైంది!
26/ 8 /1970,
మహిళా సాధికార దినోత్సవం,
పివిఎల్!
1020.
స్త్రీ పురుషుల అనన్య,
పరస్పర అవగాహనము!
సమాజాన స్త్రీకి కల్పించు,
సమాన నిజ గౌరవము!
"పని-ప్రతిఫలం", ఏ మాత్రం,
తేడా చూపకపోవడము!
"అర్ధనారీశ్వర భావం",
జీవన రథచక్రాలై ప్రగతి పథం, సాగిపోవడం, పివిఎల్!
_________
.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి